సాధారణ భక్తుడి లాగే… మన్మోహన్!

సాధారణ భక్తుడి లాగే... మన్మోహన్!

భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పాకిస్థాన్‌లో కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి హాజరుకారని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. సాధారణ భక్తుడి లాగే తొలి విడత భక్తులతో కలసి కర్తార్‌పూర్‌ దర్బార్‌ సాహిబ్‌ మందిరానికి వెళ్తారని తెలుస్తోంది. ఈ విషయంపై పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఖురేషీ శనివారం పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పాక్‌లో కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ను మేము ఆహ్వానించగా ఆయన వచ్చేందుకు అంగీకరించారని ఖురేషీ అన్నారు. కాగా […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 20, 2019 | 9:58 PM

భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పాకిస్థాన్‌లో కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి హాజరుకారని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. సాధారణ భక్తుడి లాగే తొలి విడత భక్తులతో కలసి కర్తార్‌పూర్‌ దర్బార్‌ సాహిబ్‌ మందిరానికి వెళ్తారని తెలుస్తోంది. ఈ విషయంపై పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఖురేషీ శనివారం పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పాక్‌లో కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ను మేము ఆహ్వానించగా ఆయన వచ్చేందుకు అంగీకరించారని ఖురేషీ అన్నారు. కాగా ఈ క్రమంలో మన్మోహన్‌ సన్నిహిత వర్గాలు స్పందిస్తూ.. ఆయన పాక్‌ ఆహ్వాన లేఖకు ఆయన బదులిస్తూ ప్రారంభోత్సవానికి హాజరు కానని, సాధారణ భక్తుడి లాగే వెళ్తానని చెప్పినట్లు సమాచారం. పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ సహా తొలి విడత భక్తులతో కలిసి వెళ్లి దర్శించుకుని అదే రోజు తిరుగుప్రయాణమవుతారని తెలుస్తోంది. కర్తార్‌పూర్‌ కారిడార్‌ పాక్‌లోని దర్బార్‌ సాహిబ్‌ను పంజాబ్‌లోని డేరాబాబా నానక్‌ మందిరాల్ని కలుపుతోంది. ఈ కారిడార్‌ను భారత్‌, పాక్‌లు సంయుక్తంగా నిర్మించాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu