బ్రిటన్ నుంచి వచ్ఛే ప్రయాణికులకు తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు, కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి.

బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్ఛే ప్రయాణికులకు తప్పనిసరిగా  ఆర్ టీ -పీ సీ ఆర్ టెస్టులు నిర్వహిస్తామని పౌర విమాన యానశాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి తెలిపారు. ఆ దేశంలో..

బ్రిటన్ నుంచి వచ్ఛే ప్రయాణికులకు తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు, కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 21, 2020 | 7:12 PM

Strain Virus :బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్ఛే ప్రయాణికులకు తప్పనిసరిగా  ఆర్ టీ -పీ సీ ఆర్ టెస్టులు నిర్వహిస్తామని పౌర విమాన యానశాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి తెలిపారు. ఆ దేశంలో మ్యుటెంట్ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన ట్వీట్ చేశారు. ఈ నెల 22 నుంచి 31 వరకు బ్రిటన్ నుంచి వచ్ఛే లేదా ఆదేశానికి ఇండియా నుంచి వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. అయితే ఇది తాత్కాలిక నిషేధమని వెల్లడించింది.  ఆ దేశం నుంచి ఇండియాకు చేరుకున్న ప్రయాణికుల్లో ఎవరికైనా పాజిటివ్ ఉన్నట్టు తేలితే వారిని వెంటనే క్వారంటైన్ కి తరలిస్తామని పురి పేర్కొన్నారు. అలాగే నెగెటివ్ వఛ్చినప్పటికీ వారు 7 రోజులపాటు హోం ఐసోలేషన్ లో ఉండాలని, పైగా వారికి కూడా డాక్టర్ల పర్యవేక్షణ తప్పనిసరి అని ఆయన వివరించారు. పలు యూరప్ దేశాలతో బాటు సౌదీ అరేబియా, కెనడా కూడా యూకే కి విమాన సర్వీసులను రద్దు చేశాయి. మ్యుటెంట్ కోవిడ్ మామూలు కోవిడ్ కన్నా 70 శాతం ఇన్ఫెక్షన్ తో కూడుకున్నదని బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. ఇది ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రే స్పష్టం చేశారు.

కాగా- లోగడ కరోనా వైరస్ ప్రబలిన మార్చి నెలలో ఇండియా పలు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. ఇప్పుడు మళ్ళీ బ్రిటన్ విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మరీ అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చేసిన ప్రకటన కొంత ఊరడించేదిగా ఉందని అంటున్నారు. పైగా అమెరికా కూడా దీనిపై తీవ్రంగా దృష్టి సారించలేదు.