Manchu Manoj : ముంచువారబ్బాయి..15 కిలోల బరువు తగ్గాడు..సోషల్ మీడియాలో వైరలవుతోన్న నయా లుక్

మంచు మనోజ్..హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేదు. సినిమా కోసం 100 శాతం కష్టపడతాడు ఈ మంచువారి హీరో. సినిమా చేసినంతకాలం దానిపై ఎంతో ఇష్టాన్ని ప్రదర్శిస్తాడు.

Manchu Manoj : ముంచువారబ్బాయి..15 కిలోల బరువు తగ్గాడు..సోషల్ మీడియాలో వైరలవుతోన్న నయా లుక్
Follow us

|

Updated on: Dec 25, 2020 | 1:05 PM

మంచు మనోజ్..హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేదు. సినిమా కోసం 100 శాతం కష్టపడతాడు ఈ మంచువారి హీరో. సినిమా చేసినంతకాలం దానిపై ఎంతో ఇష్టాన్ని ప్రదర్శిస్తాడు. అతడి సినిమాల సెలక్షన్ కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా తన చిత్రాల్లో ఫైట్స్‌ను స్పెషల్‌గా తానే డిజైన్ చేస్తాడు మనోజ్. కాగా 2017లో వచ్చిన  ఒక్కడు మిగిలాడు తర్వాత మరో సినిమాలో కనిపించలేదు మనోజ్. కొన్ని పర్సనల్ కారణాల వల్ల అతడు వెండితెరకు దూరమయ్యాడు. తనకు ఎంతో ఇష్టమైన సినిమాలకు దూరంగా ఉంటూ..తనతో తాను యుద్దం చేశాడు. అయితే సుదీర్ఘ విరామం తరువాత ‘అహం బ్రహ్మస్మి’తో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు ఈ యంగ్ హీరో. ఈ చిత్రంతో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.

కొంతకాలంగా బయట ఎక్కడా కనిపించని మంజు మనోజ్..తాజాగా బరువు తగ్గిన ఫోటోలు షేర్ చేసి అందర్నీ ఆశ్యర్యపరిచాడు.  ఓ సినిమా కోసం మనోజ్‌ ఏకంగా 15 కేజీల వెయిట్ తగ్గారు. బరువు తగ్గాక దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు.అలాగే ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలుపుతూ మరో ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం  ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మనోజ్ హార్డ్ వర్క్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

Also Read : 

Tadipatri fight : తాడిపత్రిలో హై అలర్ట్..అన్ని సెంటర్లలోనూ పికెటింగ్..నేడు కేసులు నమోదు చేసే ఛాన్స్

Variety marriage : వధువు పెళ్లి వద్దని వెళ్లిపోయింది…అతిథిలా వచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది

Drunk And Drive Tests : మందుబాబులకు హెచ్చరిక..నేటి నుంచి నగరంలో డ్రంక్ అండ్ టెస్టులు షురూ