ఆ బుల్లెట్లను దాచుకుంటా..ఆ పోలీసుల కాళ్లుమొక్కుతా..

ఆ బుల్లెట్లను దాచుకుంటా..ఆ పోలీసుల కాళ్లుమొక్కుతా..

దిశ హత్యాచార ఘటనలో నిందితులను పోలీసులు ఎ‌న్‌కౌంటర్ చేశారు. ఈ తెల్లవారుజామున పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. అడ్డుకోబోయిన పోలీసుల వద్ద నుంచి ఆయుదాలు లాక్కోవాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు హతమయ్యారు. కాగా మృగాళ్ల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా […]

Ram Naramaneni

|

Dec 06, 2019 | 5:55 PM

దిశ హత్యాచార ఘటనలో నిందితులను పోలీసులు ఎ‌న్‌కౌంటర్ చేశారు. ఈ తెల్లవారుజామున పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. అడ్డుకోబోయిన పోలీసుల వద్ద నుంచి ఆయుదాలు లాక్కోవాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు హతమయ్యారు. కాగా మృగాళ్ల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్‌కౌంటర్ పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కాగా టాలీవుడ్ హీరో మంచు  మనోజ్ సైతం దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తీవ్ర భావోద్వేగంతో ట్వీట్ చేశారు.’ ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది. ఆ తుపాకులకు దండం పెట్టాలని వుంది. ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది.నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు వుందా..?? ఈ రోజునే ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..!’ అంటూ ఎన్‌కౌంటర్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu