వైరల్‌గా మారిన మంచు లక్ష్మి వీడియో

మంచు లక్ష్మి తన తండ్రి మోహన్ బాబు మేనరిజంను ఇమిటేట్ చేశారు. లాక్‌డౌన్‌తో ఇంట్లో తెగ బిజీగా ఉన్న మంచు లక్ష్మి ఈ మధ్య టిక్‌టాక్‌లోకి వచ్చారు. వచ్చింది మొదలు టిక్‌టాక్‌లో తెగ సందడి చేస్తున్నారు. తన కూతురు విద్యా నిర్మానతో కలిసి టిక్‌టాక్‌లో ఫన్నీ వీడియోలను చేస్తూ ఫ్యాన్స్‌ను మెప్పిస్తున్నారు. తాజాగా “రాయలసీమ రామన్న చౌదరి” సినిమాలో మోహన్ బాబు చెప్పిన.. “నిన్న జరిగింది మర్చిపోను. నేడు జరగాల్సింది వాయిదా వేయను. రేపు జరగబోయేదాని గురించి […]

వైరల్‌గా మారిన మంచు లక్ష్మి వీడియో

మంచు లక్ష్మి తన తండ్రి మోహన్ బాబు మేనరిజంను ఇమిటేట్ చేశారు. లాక్‌డౌన్‌తో ఇంట్లో తెగ బిజీగా ఉన్న మంచు లక్ష్మి ఈ మధ్య టిక్‌టాక్‌లోకి వచ్చారు. వచ్చింది మొదలు టిక్‌టాక్‌లో తెగ సందడి చేస్తున్నారు. తన కూతురు విద్యా నిర్మానతో కలిసి టిక్‌టాక్‌లో ఫన్నీ వీడియోలను చేస్తూ ఫ్యాన్స్‌ను మెప్పిస్తున్నారు. తాజాగా “రాయలసీమ రామన్న చౌదరి” సినిమాలో మోహన్ బాబు చెప్పిన.. “నిన్న జరిగింది మర్చిపోను. నేడు జరగాల్సింది వాయిదా వేయను. రేపు జరగబోయేదాని గురించి ఆలోచించను” సూపర్ డైలాగ్‌‌‌ను చెప్పి టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు . ఈ వీడియో షేర్‌ చేసిన లక్ష్మి..నాన్న మేనరిజంను అందుకోలేకపోయాను అంటు ట్యాగ్ చేశారు. ఇది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది.