55 అడుగుల కొబ్బరి చెట్టుపై అచేతనంగా పడి ఉన్న వ్యక్తి..స్థానికులు సమాచారంతో స్పాట్‌కు పోలీసులు..ట్విస్ట్ ఏంటంటే

ఫుల్లుగా మద్యం తాగాడు. ఆపై కొబ్బరి కాయలు కోసేందుకు చెట్టు ఎక్కాడు. మత్తు ఎక్కువవ్వడంతో అక్కడే కొబ్బరి మట్టలపై హాయిగా సేదతీరాడు.

55 అడుగుల కొబ్బరి చెట్టుపై అచేతనంగా పడి ఉన్న వ్యక్తి..స్థానికులు సమాచారంతో స్పాట్‌కు పోలీసులు..ట్విస్ట్ ఏంటంటే
Follow us

|

Updated on: Dec 15, 2020 | 3:39 PM

ఫుల్లుగా మద్యం తాగాడు. ఆపై కొబ్బరి కాయలు కోసేందుకు చెట్టు ఎక్కాడు. మత్తు ఎక్కువవ్వడంతో అక్కడే కొబ్బరి మట్టలపై హాయిగా సేదతీరాడు. చెట్టుపై అతడు అచేతనంగా పడిఉండటం చూసి కంగారుపడిన స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అందరి అక్కడికి చేరుకుని గట్టిగా మాట్లాడుతూ ఉండటంతో మందుబాబు నిద్రకు ఆటంకం కలిగింది. దీంతో వెంటనే లేచి సాదాసీదాగా చెట్టుపై నుంచి కిందకు దిగాడు. దీంతో స్థానికులతో పాటు అక్కడికి వచ్చిన అధికారులు నోరెళ్లబెట్టారు. ఈ విచిత్ర ఘటన చెన్నైలోని తంజావూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సరుక్కై వేలూర్‌కు చెందిన 40 ఏళ్ల లోకనాథన్‌  కొబ్బరి కాయలు కోసే పని చేస్తున్నాడు. తమిళరసన్‌ అనే వ్యక్తి తోటలో కొబ్బరి కాయలు కోస్తానని చెప్పి వెళ్లి 3 గంటలపాటు తిరిగి రాలేదు. దీంతో కొందరు తోటకు వెళ్లి  వెతకగా సుమారు 55 అడుగుల ఎత్తైన ఓ కొబ్బరి చెట్టుపై మట్టల మధ్యలో అచేతనంగా కనిపించాడు. దీంతో వారు కంగారుపడి పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి అతడు చెట్టుపై నిద్రపోతున్నాడని గుర్తించారు. ఈ శబ్దాలకు లోకనాథన్ నిద్రలేచాడు.  తాడు సాయంతో కిందకు దిగాలంటూ ఫైర్ సిబ్బంది అతడి సూచించారు. అవేం అవసరం లేదంటూ..అతడు కూల్‌గా చెట్టు దిగాడు. అక్కడ గుమిగూడిన జనాన్ని, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని చూసి సైలెంట్‌గా వెళ్లిపోతుండగా… పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు అడగ్గా… కొబ్బరి బోండాలు కోసే సమయంలో నిద్ర వచ్చిందని, అందువల్ల మట్టలపై నిద్రపోయానని చెప్పాడు. పోలీసులు కాస్త గట్టిగా అడగడంతో… మద్యం మత్తులో అలా చేశానని తెలిపాడు. దీంతో పోలీసులు అతడిని మందలించి పంపించారు.

Also Read : ప్రిన్సిపాల్ గారూ..! సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు..పిల్లల ముందు చేసేది ఇలాంటి పనులేనా?