ప్రేమ అంటే ఇదే : ఈ వీడియో చూస్తే క‌న్నీళ్లు ఆగ‌వు

ప్రేమ..దీని మీనింగ్ వ‌ర్ణించ‌లేనిది. ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ద్ద‌తిలో ప్రేమ‌ను వ్యక్త‌ప‌రుస్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఎక్కువ టైమ్ పాస్ ప్రేమ‌ల‌ను మాత్ర‌మే చూస్తున్నాం.

ప్రేమ అంటే ఇదే : ఈ వీడియో చూస్తే క‌న్నీళ్లు ఆగ‌వు
Follow us

|

Updated on: Jul 31, 2020 | 9:40 AM

Man goes bald for girlfriend : ప్రేమ..దీని మీనింగ్ వ‌ర్ణించ‌లేనిది. ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ద్ద‌తిలో ప్రేమ‌ను వ్యక్త‌ప‌రుస్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఎక్కువ టైమ్ పాస్ ప్రేమ‌ల‌ను మాత్ర‌మే చూస్తున్నాం. రియ‌ల్ ల‌వ్వులు ‘రీల్’కే ప‌రిమిత‌మైపోయాయి. అవ‌స‌రాల కోసం ప్రేమ పేరుతో యువ‌త అడ్డ‌దార్లు తొక్కుతున్నారు. ప్రేమ‌కు వ్యాల్యూ లేకుండా చేస్తున్నారు. కానీ నిజ‌మైన ప్రేమ ఎక్క‌డో ఓ చోట బ్ర‌తికే ఉంటుంది. ఈ స్టోరీ చ‌దివితే ఆ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది.

ట‌ర్మ్స్ అండ్ కండీష‌న్స్ బానే ఉన్నప్పుడు ప్రేమికుల మ‌ధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. కానీ ప్రేమించిన‌వారు క‌ష్ట‌స‌మయాల్లో కూడా తోడు నిల‌వ‌డం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్క‌డే అంద‌రూ దొరికిపోతారు. కానీ కొంద‌రు మాత్రం ప్రేమ కోసం ఎందాకైనా వెళ్తారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలోని జంట అందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహార‌ణ. ప్రియురాలికి మద్దతుగా నిలవడానికి ప్రియుడు గుండు గీసుకుని ఆమె మీద ఉన్న అపార‌మైన‌ ప్రేమను చాటుకున్నాడు.

బాస్కెట్‌ బాల్‌ ఆటగాడు రెక్స్‌ చాప్‌మాన్ ఇందుకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్‌ చేశాడు. ఓ యువతి పేనుకొరుకుడు వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కుంటుంది. రోగ నిరోధక వ్యవస్థ జుట్టు కుదుళ్ల మీద దాడి చేయడం వల్ల ఈ వ్యాధి ప్ర‌భ‌లుతుంది. ఈ వ్యాధి సోకితే జుట్టు అధిక మోతాదులో రాలిపోతుంది. యువ‌తి ఆ ఇబ్బంది ఎదుర్కోవ‌డంతో ఆమె ప్రియుడు ట్రిమ్మర్‌తో ప్రియురాలికి గుండు చేశాడు. ఆమెకు గుండు చేయడం పూర్తయిన తర్వాత ఒక్క‌సారిగా తాను కూడా గుండు చేసుకున్నాడు. దీంతో ఆ యువతి భావోద్వేగానికి గురై క‌న్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియోను ఈ జంట‌ను చూసిన నెటిజ‌న్లు నిజ‌మైన ప్రేమ అంటే ఇదే అని కొనియాడుతున్నారు.

Read More : కరోనా స‌మయంలో బక్రీద్ : ‌‌డ‌బ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలు