దుప్పట్లో దూరిన విషనాగు.. ఎట్టకేలకు..

సమీపంలో పాము కనిపిస్తే అమడ దూరం పారిపోతాం.. అలాంటిది ఏకంగా పడుకున్న దుప్పటిలో దూరితే ఏమన్నా ఉందా.. ప్రాణాలు గాలిలో తేలిపోతాయి. ఇలాంటి ఘటనే ఒడిశాలోని క‌ట‌క్ జిల్లాలో చోటుచేసుకుంది. బంకీ హ‌రీరాజ్ పురా గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి ఇంట్లోకి ఎవ‌రూ లేని స‌మ‌యంలో పాము అతిథిగా వ‌చ్చింది.

దుప్పట్లో దూరిన విషనాగు.. ఎట్టకేలకు..
Balaraju Goud

|

Aug 26, 2020 | 6:22 PM

సమీపంలో పాము కనిపిస్తే అమడ దూరం పారిపోతాం.. అలాంటిది ఏకంగా పడుకున్న దుప్పటిలో దూరితే ఏమన్నా ఉందా.. ప్రాణాలు గాలిలో తేలిపోతాయి. ఇలాంటి ఘటనే ఒడిశాలోని క‌ట‌క్ జిల్లాలో చోటుచేసుకుంది. బంకీ హ‌రీరాజ్ పురా గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి ఇంట్లోకి ఎవ‌రూ లేని స‌మ‌యంలో పాము అతిథిగా వ‌చ్చింది. ఏకంగా బెడ్ ఎక్కి దుప్ప‌టి క‌ప్పుకొని మ‌రీ నిద్ర‌పోతున్న‌ది. ఇదిలావుంటే, బ‌య‌ట ప‌నుల‌న్నీ ముగించుకొని ఇంటి య‌జ‌మాని తిరిగి వ‌చ్చాడు. బెడ్‌రూంలోకి రాగానే బుస్‌.. బుస్‌మ‌ని శ‌బ్దాలు వినిపించాయి. ఏమైందా అని రూం అంతా వెతికాడు. ఎక్క‌డా ఏం క‌నిపించ‌లేదు. ఎందుకైనా మంచిందని మరోసారి బెడ్‌రూంలోని మంచాన్ని మొత్తం దులపడం మొదలుపెట్టాడు. బెడ్‌షీట్ తీసి చూస్తే అమ్మో.. నాగుపాము. దీంతో వెంట‌నే స్కేక్ హెల్ప్‌లైన్ వాలంటీర్ల‌కు స‌మాచారం అందించాడు. త‌క్ష‌ణ‌మే స్పందించిన వాలంటీర్లు అక్క‌డికి చేరుకుని దుప్ప‌టి కింద ఉన్న కోబ్రాను ప‌ట్టుకున్నారు. అది సుమారు 5 అడుగుల పొడ‌వు ఉంది. ఇది విష‌పూరిత‌మైన‌దని స్నేక్ క్యాచర్స్ చెప్పారు. కాటేస్తే మ‌నిషి ప్రాణాల‌కే ప్ర‌మాదం అని స్నేక్ వాలంటీర్లు పేర్కొన్నారు. అనంతరం ఆ విష నాగును దగ్గరలోని ఫారెస్ట్ లోకి వదిలేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu