Awareness on Mental Health: ఈ మాజీ జవాన్ సంకల్పానికి చేతులెత్తి మొక్కాలి.. మానసిక ఆరోగ్యం గురించి ఏం చేస్తున్నాడో తెలుసా..

Awareness on Mental Health: ఆధునిక కాలంలో యువత చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మెంటల్ హెల్త్‌ సరిగా

Awareness on Mental Health: ఈ మాజీ జవాన్ సంకల్పానికి చేతులెత్తి మొక్కాలి.. మానసిక ఆరోగ్యం గురించి ఏం చేస్తున్నాడో తెలుసా..
Follow us

|

Updated on: Jan 05, 2021 | 9:41 PM

Awareness on Mental Health: ఆధునిక కాలంలో యువత చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మెంటల్ హెల్త్‌ సరిగా లేక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. టెక్నాలజీ ఫీక్ స్టేజ్‌కి వెళ్లిపోవడంతో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితులలో జీవితాలను గడుపుతున్నారు. ఇదే విషయం పలు సర్వేల్లో కూడా తేలింది. అయితే ఇది గమనించిన పుణెకు చెందిన రోనిత్ రంజన్ అనే మాజీ జవాన్ ఏదైనా ఒకటి చేయలనుకున్నాడు. అందుకోసం మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని పాదయాత్ర మొదలుపెట్టాడు. ఏకంగా కన్యాకుమారి నుంచి లేహ్ వరకు నాలుగు వేల పాదయాత్రను కొనసాగిస్తున్నాడు. అందులో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్న రంజన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించాలని చెబుతున్నాడు. మార్చి 31నాటికి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకొని 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు మెంటల్ హెల్త్ కరికులమ్ రూపొందించాలని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖకు పిటిషన్ ఇవ్వనున్నట్లు తెలిపాడు. తనకు టీచర్లు, ఆఫీసర్లు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తల నుంచి సహకారం లభిస్తోందని అన్నారు. అందుకు ధన్యవాదాలు తెలిపారు. తన పాదయాత్రలో భాగంగా పలు పాఠశాలలను సందర్శిస్తూ, వారికి మెంటల్ హెల్త్‌పై అవగాహన కల్పిస్తున్నట్టు వెల్లడించాడు. పాఠశాలలు, కాలేజీల్లో ‘మెంటల్ హెల్త్ వీక్’, ‘మెంటల్ హెల్త్ డే’ పేరిట అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మానసికంగా బలంగా ఉండాలనేది తన లక్ష్యమని కోరుకుంటున్నాడు.

ఇయర్ ఫోన్స్‌తో జాగ్రత్త.. అతిగా వాడారో అంతే సంగతులు.. హెచ్చరిస్తున్న ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌లు..