దొంగిలించిన సొమ్ముతో పేదలకు సాయం, ఛారిటీలకు విరాళం, ఢిల్లీలో అభినవ ‘ రాబిన్ హుడ్ ‘అరెస్ట్

తను దొంగిలించిన సొమ్మును పేదలకు సాయం చేసేందుకు, ధర్మ కార్యాలకు, ఛారిటీలకు విరాళమిచ్చేందుకు వినియోగించే..

  • Umakanth Rao
  • Publish Date - 6:41 pm, Sun, 10 January 21
దొంగిలించిన సొమ్ముతో పేదలకు సాయం, ఛారిటీలకు విరాళం, ఢిల్లీలో అభినవ ' రాబిన్ హుడ్ 'అరెస్ట్

తను దొంగిలించిన సొమ్మును పేదలకు సాయం చేసేందుకు, ధర్మ కార్యాలకు, ఛారిటీలకు విరాళమిచ్చేందుకు వినియోగించే అభినవ ‘రాబిన్ హుడ్ ‘ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మహమ్మద్ ఇర్ఫాన్ అనే ఇతడిని వారు ఈ నెల 7 న అరెస్టు చేసి,, ఇతడి నుంచి మూడు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. బీహార్ కు చెందిన ఈ ‘పేదల పాలిట ఆపద్బాంధవుడు’.. తన చోరీ సొమ్ముతో హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసేవాడని పోలీసులు తెలిపారు. బీహార్ లో సీతామర్హి ప్రాంత వాసి అయిన ఇర్ఫాన్….. జిల్లా పరిషద్ ఎన్నికల్లో పోటీ చేసి ఓ యూత్ నాయకుడనిపించుకోవాలని తహతహలాడేవాడట..

తన ముఠా సభ్యులు కేవలం పోష్ లొకాలిటీలోని ధనవంతుల ఇళ్లను మాత్రమే దోచుకునేవారని  ఈ అభినవ రాబిన్ హుడ్ చెప్పాడు. ఈ ముఠా నుంచి ఖాకీలు 26 లక్షల నగదును, విదేశాల్లో తయారైన రెండు పిస్టళ్లను, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. తమ ఇన్వెస్టిగేషన్ లో ఈ తరహా కేసు బయటపడడం ఇదే మొదటిసారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Also Read:

కోవిడ్ టీకా కోసం భారత్‌తో ఒప్పందం చేసుకున్న మయన్మార్.. 30 మిలియన్ వ్యాక్సిన్లు కావాలంటూ ఆర్డర్

ఏడు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్ద్ ఫ్లూ, నియంత్రణకు సెంట్రల్ టీమ్స్ ని ఏర్పాటు చేసిన కేంద్రం.

Bitcoin Price : రాకెట్‌లా దూసుకుపోతున్న బిట్ కాయిన్.. 1.46 లక్షల డాలర్లకు చేరుకునే ఛాన్స్..