రాజన్న స్మరణలో దీదీ

హైదరాబాద్‌ : ఏపీ మాజీ సీఎం,  దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నివాళులర్పించారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ జయంతిని సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ట్వీట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆమె ట్యాగ్‌ చేశారు. ఇక వైఎస్సార్ జయంతి రోజును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించిన విషయం […]

  • Ram Naramaneni
  • Publish Date - 9:04 pm, Mon, 8 July 19
రాజన్న స్మరణలో దీదీ

హైదరాబాద్‌ : ఏపీ మాజీ సీఎం,  దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నివాళులర్పించారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ జయంతిని సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ట్వీట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆమె ట్యాగ్‌ చేశారు.

ఇక వైఎస్సార్ జయంతి రోజును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే.  పలువురు నాయకులతోపాటు వైస్సార్ అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.