Mamata Banerjee Dance : ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స్టెప్పులు..ఖుషీ అయిన కార్యకర్తలు

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ  స్టేజ్‌పై కాలు కదిపారు.  జాన‌ప‌ద క‌ళాకారుల‌తో క‌లిసి డ్యాన్స్ చేశారు. తాజాగా, మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ను ప్రారంభించిన ఆమె.. స్టేజ్‌పై స్టెప్పులతో ఆకట్టుకున్నారు.

Mamata Banerjee Dance : ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స్టెప్పులు..ఖుషీ అయిన కార్యకర్తలు
Follow us

|

Updated on: Dec 24, 2020 | 2:46 PM

Mamata Banerjee Dance ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ  స్టేజ్‌పై కాలు కదిపారు.  జాన‌ప‌ద క‌ళాకారుల‌తో క‌లిసి డ్యాన్స్ చేశారు. తాజాగా, మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ను ప్రారంభించిన ఆమె.. స్టేజ్‌పై స్టెప్పులతో ఆకట్టుకున్నారు. కొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మ‌మ‌తా బెన‌ర్జీ పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జనంతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు.   ఈ క్రమంలో మ్యూజీషియ‌న్లు, గాయకులు, నృత్యకారులు నిర్వహించిన మ్యూజిక్ ఫెస్ట్‌లో మమతా పాల్గొన్నారు. అలాగే రాష్ట్రానికి చెందిన ప్రముఖ సంత‌ల్ డ్యాన్సర్ బ‌సంతీ హేమ్‌బ్ర‌మ్‌ను సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స‌న్మానించారు. అయితే స్టేజ్‌పై స్టెప్పులేస్తున్న బసంతితో .. మ‌మ‌తా కూడా డ్యాన్స్‌చేసి అందరినీ అలరించారు. త‌న‌కు స్టెప్పులు నేర్పించాలంటూ అడిగిన దీదీ.. అదే జోష్ లో డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది

మ్యూజిక్‌ ఫెస్ట్‌లో హుషారుగా పాల్గొన్న మమతా బెనర్జీ తన డ్యాన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ త‌ర్వాత త‌న ప్ర‌సంగంలో బీజేపీపై విమర్శనాస‌్త్రాలు ఎక్కుపెట్టారు. బెంగాల్‌ను ఎన్న‌టికీ గుజ‌రాత్‌లా మార్చ‌మంటూ ఘాటు వ్యాఖ్యలు చేశార. జాతీయ గీతం, జై హింద్ లాంటి స్లోగ‌న్స్ అన్నీ బెంగాల్‌లోనే పుట్టాయ‌ని గుర్తు చేశారు. ఏదో ఒక రోజు ప్రపంచం మొత్తం బెంగాల్‌కు సెల్యూట్ చేసే రోజు వస్తందని గర‌్వంగా చెప్పారు.

Also Read :