ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న పాత రోగాలు.. పెరుగుతున్న మలేరియా, టీబీ కేసులు.. అప్రమత్తత అవసరమంటున్న నిపుణులు

విశ్వవ్యాప్తంగా వైద్యులందరూ కోవిడ్ వ్యాధిపై ఫోకస్ చేశారు. ఇక, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న నిపుణులు ఆందోళన చెందుతున్నారు. వైద్యవిభాగమంతా కరోనా మహమ్మారి నియంత్రణలో మునిగిన ప్రస్తుత తరుణంలో టీబీ, మలేరియాలను 2030 నాటికల్లా కట్టడి చేయాలన్న లక్ష్యం నెరవేరేలా కనిపించడంలేదు.

ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న పాత రోగాలు.. పెరుగుతున్న మలేరియా, టీబీ కేసులు.. అప్రమత్తత అవసరమంటున్న నిపుణులు
Follow us

|

Updated on: Dec 28, 2020 | 12:10 PM

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. కోట్ల మంది కరోనా వైరస్ బారినపడితే, లక్షలాది మంది అమాయకులు వైరస్ ధాటికి ప్రాణాలను కోల్పోయారు. దీంతో విశ్వవ్యాప్తంగా వైద్యులందరూ కోవిడ్ వ్యాధిపై ఫోకస్ చేశారు. ఇక, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న నిపుణులు ఆందోళన చెందుతున్నారు. వైద్యవిభాగమంతా కరోనా మహమ్మారి నియంత్రణలో మునిగిన ప్రస్తుత తరుణంలో టీబీ, మలేరియాలను 2030 నాటికల్లా కట్టడి చేయాలన్న లక్ష్యం నెరవేరేలా కనిపించడంలేదు.

ఈ నేపధ్యంలో రాబోయే ఐదేళ్లలో టీబీ మరణాల రేటు 20 శాతం, మలేరియా మరణాల రేటు 36 శాతం మేరకు పెరిగే అవకాశాలున్నాయని వైద్య రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే.. మనదేశంలో టీబీ, మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో భారత్‌లోనూ ఈ ముప్పు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా టీబీ, మలేరియా బాధితుల సంఖ్యను 80 శాతం తగ్గించాలని, ఈ వ్యాధుల కారణంగా సంభవించే మరణాలను 90 శాతం వరకూ తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ప్రాథమిక దశల్లో వ్యాధిని గుర్తించి సమూలంగా నివారించేందుకు చికిత్స ప్రారంభించారు. వ్యాధులపట్ల ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. అయినప్పటికి గడచిన ఐదేళ్లలో అనుకున్నంత స్థాయిలో ఫలితాలు రాలేదని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్-19 కట్టడిలో మునిగివున్నందున టీబీ, మలేరియా నియంత్రణ లక్ష్యానికి గండిపడే అవకాశాలున్నయని లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ నివేదికలో వెల్లడయ్యింది. 2020 నాటికి టీబీ కేసులను 20 శాతానికి, మరణాల సంఖ్యను 25 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకూ టీబీ కేసులను 9 శాతానికి, మరణాల సంఖ్యను 14 శాతం వరకూ మాత్రమే తగ్గించగలిగారు. ఇక మలేరియా విషయానికొస్తే 2020 నాటికి 40 శాతం తగ్గుదల లక్ష్యంగా ఉండగా, 10 శాతానికే ఇది పరిమితమైంది. గడచిన ఐదేళ్లలో భారత్‌లో మలేరియా అదుపునకు తీసుకున్న చర్యలు ఫలితమివ్వడం లేదని తెలుస్తోంది. ఇదిలావుండగా ఆఫ్రికాలో మలేరియా బాధితుల సంఖ్య ఇటీవలి కాలంలో మరింతగా పెరిగింది. లాన్సెట్ రిపోర్టును అనుసరించి ప్రస్తుత కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా టీబీ, మలేరియా మరణాల సంఖ్య పెరిగింది. ఇది మరింత ఆందోళన కలిగిస్తోందిన శాస్త్రవేత్తలు తెలిపారు. కొత్త వైరస్ ‌తోపాటు ఇతర వ్యాధుల పట్ల కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని వైద్య శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!