పుల్వామా జిల్లాలో బ్రిడ్జ్ కింద బాంబు, తప్పిన పెను ప్రమాదం

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్ళీ పేట్రేగిపోతున్నారు.  అదను దొరికితే చాలు.. భద్రతా దళాలపై ఏదో విధంగా దాడులకు ప్లాన్ చేస్తున్నారు.  నిన్న రాత్రి పుల్వామా జిల్లాలోని తుజాన్ అనే గ్రామంలో ఒక వంతెన కింద వారు రహస్యంగా బాంబును ఉంచారు.

పుల్వామా జిల్లాలో బ్రిడ్జ్ కింద బాంబు, తప్పిన పెను ప్రమాదం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 17, 2020 | 12:45 PM

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్ళీ పేట్రేగిపోతున్నారు.  అదను దొరికితే చాలు.. భద్రతా దళాలపై ఏదో విధంగా దాడులకు ప్లాన్ చేస్తున్నారు.  నిన్న రాత్రి పుల్వామా జిల్లాలోని తుజాన్ అనే గ్రామంలో ఒక వంతెన కింద వారు రహస్యంగా బాంబును ఉంచారు. అయితే సెక్యూరిటీ దళాలు అప్రమత్తమై  దాన్ని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ గ్రామ రోడ్డు దగ్గరలోని దాల్వాన్ అనే మరో గ్రామానికి దారి తీస్తుందని, సాధారంణంగా జవాన్లు ఈ మార్గం ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారని జమ్మూ కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. వారు అప్రమత్తంగా లేకపోయి ఉంటే ఈ బాంబు పేలిపోయి పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఆయన అన్నారు.

ఇక పుల్వామా, బడ్గామ్ జిల్లాల మధ్య దాదాపు రోజూ సైనికులుప్రయాణిస్తుంటారని, వీరి కదలికలపై నిఘా పెడుతున్న ఉగ్రవాదులు ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. అయితే మన జవాన్లు సైతం వారి ప్రయత్నాలను దెబ్బ తీస్తున్నారని ఆయన అన్నారు.