నాల్గవసారి శ్రీలంక ప్ర‌ధానిగా.. మ‌హీంద రాజ‌ప‌క్స!

నాల్గవసారి శ్రీలంక ప్ర‌ధానిగా.. మ‌హీంద రాజ‌ప‌క్స!

ద్వీప దేశం శ‌్రీలంక నూత‌న‌ ప్ర‌ధానిగా మహీంద రాజ‌ప‌క్స ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించిన రాజ‌ప‌క్స‌తో ఈరోజు ఉద‌యం కొలంబో శివారులోని కేలానియాలో ఉన్న చారిత్ర‌క

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 09, 2020 | 12:53 PM

ద్వీప దేశం శ‌్రీలంక నూత‌న‌ ప్ర‌ధానిగా మహీంద రాజ‌ప‌క్స ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించిన రాజ‌ప‌క్స‌తో ఈరోజు ఉద‌యం కొలంబో శివారులోని కేలానియాలో ఉన్న చారిత్ర‌క బౌద్ధ దేవాల‌యంలో ఆయ‌న త‌మ్ముడు, దేశాధ్య‌క్షుడు గోట‌బ‌య రాజ‌పక్స‌ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఆగ‌స్టు 5న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాజ‌పక్స‌ నేతృత్వంలోని శ్రీల‌కం పీపుల్స్ పార్టీ (ఎస్ఎల్పీపీ) ఘ‌న‌విజ‌యం సాధించింది. మొత్తం 225 సీట్లున్న పార్ల‌మెంటులో ఆ పార్టీ సొంతంగా 145 స్థానాల్లో విజ‌యం సాధించింది. మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిపి ఆపార్టీ మెజార్టీ 150కి చేరింది.

ఈ సార్వత్రిక ఎన్నిక‌ల్లో 74 ఏళ్ల రాజ‌ప‌క్స ఐదు ల‌క్ష‌ల వ్య‌క్తిగ‌త ప్రాధాన్య‌త ఓట్ల‌ను సాధించారు. ఆదేశ ఎన్నికల చ‌రిత్ర‌లో ఒక అభ్య‌ర్థి ఇంత భారీ స‌ఖ్య‌లో ఓట్ల‌ను సాధించ‌డం ఇదే మొద‌టిసారి. రాజ‌పక్స‌ జూలైలో త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంలో 50 ఏండ్లు పూర్తిచేసుకున్నారు. ఆయ‌న మొద‌టిసారిగా 1970లో త‌న 24 ఏట పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అప్ప‌టినుంచి రెండుసార్లు దేశాధ్య‌క్షుడిగా, మూడుసార్లు ప్ర‌ధానిగా నియ‌మితుల‌య్యారు. 2005 నుంచి 2015 వ‌ర‌కు ప‌దేండ్ల పాటు శ్రీలంక అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. మ‌హింద రాజ‌పక్స‌ త‌మ్ముడు గోట‌బ‌య రాజ‌ప‌క్స గ‌త న‌వంబ‌ర్‌లో జ‌రిగిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఎస్ఎల్సీపీ అభ్య‌ర్థిగా పోటీచేసి విజ‌యం సాధించారు.

Read More:

30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు.. తొలి దశలో 15 లక్షల ఇళ్లు..!

ఆదుకున్న రబీ దిగుబడి.. రాష్ట్రానికి తప్పిన ఆహార ఇబ్బందులు..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu