ఫ్యాన్స్‌కు మహేష్ స్పెషల్ ట్రీట్.. కెరీర్‌లోనే మొదటిసారి!

Mahesh Babu And Vamsi Paidipally Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనున్న ఈ మూవీ ఏప్రిల్ రెండోవారం నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన కెరీర్‌లోనే మొదటిసారి మహేష్ బాబు డబుల్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. అందులో […]

ఫ్యాన్స్‌కు మహేష్ స్పెషల్ ట్రీట్.. కెరీర్‌లోనే మొదటిసారి!

Mahesh Babu And Vamsi Paidipally Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనున్న ఈ మూవీ ఏప్రిల్ రెండోవారం నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తన కెరీర్‌లోనే మొదటిసారి మహేష్ బాబు డబుల్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. అందులో ఒకటి గ్యాంగ్‌స్టర్ పాత్ర కాగా.. మరొకటి లెక్చరర్ పాత్ర అని తెలుస్తోంది. అంతేకాక ఈ సినిమా లైన్ 1995లో రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘భాషా’ సినిమాను పోలి ఉంటుందని ఫిల్మ్‌నగర్ టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అయితే గతంలో ‘నాని’ సినిమాలో మహేష్ కొద్దిసేపు డ్యూయల్ రోల్‌లో కనిపించనున్న సంగతి విదితమే.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంగీతం ఎస్.ఎస్.థమన్ అందించనుండగా.. హీరోయిన్ శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కాగా, ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu