కరోనా అప్డేట్: మహారాష్ట్రలో 5 లక్షలు.. తమిళనాడులో 3 లక్షలకు చేరువలో..

దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన మూడు రోజులుగా రికార్డుస్థాయిలో 60,000 పైచిలుకు కేసులు..

కరోనా అప్డేట్: మహారాష్ట్రలో 5 లక్షలు.. తమిళనాడులో 3 లక్షలకు చేరువలో..
Follow us

|

Updated on: Aug 09, 2020 | 3:36 PM

Maharashtra’s coronavirus tally crosses 5 lakh: దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన మూడు రోజులుగా రికార్డుస్థాయిలో 60,000 పైచిలుకు కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇటు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో పాటు రికవరీ రేటు కూడా పెరగడం కాస్త ఊరటను ఇచ్చే అంశం.

ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,53,010కి చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే 5,03,084 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. నిన్న ఒక్క రోజే 12,822 కేసులు వచ్చాయి. అటు తమిళనాడులో 2,90,907 కేసులు ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 2,17,040, కర్ణాటకలో 1,72,102, దేశ రాజధాని ఢిల్లీలో 1,44,127 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ తప్పితే మిగిలిన రాష్ట్రాలన్నింటిలోనూ ప్రతీ రోజూ 5 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కాగా, ఢిల్లీలో మాత్రం గతంలో పోలిస్తే పాజిటివ్ కేసుల నమోదు తీవ్రత తగ్గింది.