Corona: మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్..! పెరుగుతున్న కేసులు.. తాజాగా ఎన్ని నమోదయ్యాయంటే?

Maharashtra Corona Updates: మహారాష్ట్రలో కరోనావైరస్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా నమోదవుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత కొన్నిరోజుల నుంచి పెరుగుతున్న కరోనా కేసులతో..

  • Shaik Madarsaheb
  • Publish Date - 9:10 pm, Sun, 7 March 21
Corona: మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్..! పెరుగుతున్న కేసులు.. తాజాగా ఎన్ని నమోదయ్యాయంటే?

Maharashtra Corona Updates: మహారాష్ట్రలో కరోనావైరస్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా నమోదవుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత కొన్నిరోజుల నుంచి పెరుగుతున్న కరోనా కేసులతో ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పెరుగుతున్న కేసులు రాష్ట్రంలో మళ్లీ కలకలం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 11,141 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు 22,19,727 మందికి మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ మహమ్మారి కారణంగా 52,478 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 6,013 మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి 20,68,044 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 97,983 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కట్టడికి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.


ఇదిలాఉంటే.. ముఖ్యంగా మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, పంజాబ్‌, క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లోనే కొత్త కేసుల సంఖ్య ఎక్కువ‌గా నమోదవుతుందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 18,711 కొత్త కేసులు న‌మోదు కాగా.. అందులో 84.71 శాతం కేసులు ఆరు రాష్ట్రాల్లోనే న‌మోద‌య్యాయ‌ని కేంద్రం తెలిపింది. ఆరు రాష్ట్రాలు మినహా.. దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు, మిగతా రాష్ట్రాల్లో కేవ‌లం 15.29 శాతం మాత్రమే కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది. అయితే చాలా రాష్ట్రాల్లో కేసులు నమోదైనప్పటికీ.. ఒక్క మరణం కూడా సంభవించలేదని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

Also Read:

JEE Main Result 2021: మళ్లీ నిరాశే.. స్పష్టమైన ప్రకటన చేయని ఎన్టీఏ.. జేఈఈ ఫలితాలు మరింత ఆలస్యం..!

IT Raids: తమిళనాడులో ఐటీ రైడ్స్.. బయటపడిన వేయి కోట్ల అక్రమాస్తులు.. ఎక్కడెక్కడ దాడులు జరిపారంటే..?