Maha Crisis: గంటగంటకు ఉత్కంఠత రేపుతున్న మహా పాలిటిక్స్.. డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసును సవాల్ చేసిన షిండే

Maharashtra Political Crisis: శివసేన రెబల్ నాయకుడు ఏక్​నాథ్​శిండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర రెబల్​ ఎమ్మెల్యేలకు.. డిప్యూటీ స్పీకర్​అనర్హత నోటీసులు అందించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పిటిషన్​ దాఖలు చేశారు. శివసేన శాసనసభా పక్ష నేతగా తనను తొలగిస్తూ.. అజయ్​ ఛౌదరిని నియమించడాన్ని కూడా సవాల్​ చేశారు శిండే.

Maha Crisis: గంటగంటకు ఉత్కంఠత రేపుతున్న మహా పాలిటిక్స్.. డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసును సవాల్ చేసిన షిండే
Eknath Shinde
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 27, 2022 | 6:21 AM

మహారాష్ట్ర రాజకీయాలు గంటగంటకు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. మహారాష్ట్ర పొలిటికల్‌ సంక్షోభం రాష్ట్రపతి పాలన వైపు అడుగులు వేస్తోంది. రెబల్స్‌ ఎమ్మెల్యేలపై ముంబై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో.. ఇప్పుడు బంతి సుప్రీంకోర్టులోకి వెళ్లింది. అనర్హత వేటు పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో ఆదివారం రాత్రి రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లను స్వీకరించిన సుప్రీంకోర్టు నేడు విచారణకు అనుమతి ఇచ్చింది. ఈ వాదనల్లో సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ లేపుతోంది. మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఢిల్లీకి చేరింది. తనకు, తన వర్గం ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన డిస్ క్వాలిఫికేషన్ నోటీషును సవాలు చేస్తూ శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శివసేన లెజిస్లేచర్ పార్టీ నేతగా తన స్థానంలో అజయ్ చౌదరిని నియమించడాన్ని షిండే సవాలు చేశారు. షిండే సవాల్ పై ఇవాళ ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

శివసేనకు, సీఎం ఉద్దవ్ ఠాక్రేకు మద్దతుగా ఒక్క మహారాష్ట్రలోనే కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో కూడా కార్యకర్తలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు కార్యకర్తలు. శివసేనకు ద్రోహం చేసిన రెబల్ ఎమ్మెల్యేలకు బుద్ది చెబుతామంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

మహారాష్ట్ర విధానసభ సచివాలయం.. శిందే సహా 16 మంది శివసేన రెబల్​ ఎమ్మెల్యేలకు శనివారం అనర్హత వేటు నోటీసులు జారీ చేసింది. జూన్​ 27 సాయంత్రంలోగా దీనికి రాతపూర్వక సమాధానాలు ఇవ్వాలని అందులో స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

తాజాగా శిండే శిబిరానికి మహారాష్ట్ర కేబినెట్​ మంత్రి ఉదయ్​ సామంత్ కూడా​ చేరుకున్నారు. ఈయన శిండే వర్గంలో చేరిన 9వ మంత్రి అని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన మంత్రులు నలుగురే మిగిలారు. వారిలో ఎమ్మెల్యేగా ఉంది సీఎం ఉద్ధవ్​ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే మాత్రమే. మిగతా ముగ్గురు.. సీఎం ఉద్ధవ్​ ఠాక్రే, అనిల్​ పరబ్​, సుభాష్​ దేశాయ్​ ఎమ్మెల్సీలు.

మరోవైపు శిండే వర్గంలోని ఎమ్మెల్యేలు సహా వారి కుటుంబసభ్యులకు తక్షణమే భద్రత కల్పించాలని రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ.

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..