ఆందోళనలో మహారాష్ట్ర రైతులు కూడా ! నాసిక్ నుంచి ఢిల్లీకి ప్రయాణం, చట్టాల రద్దుకై హర్యానాలో అన్నదాతల హోమం,

రైతుల ఆందోళనలో మహారాష్ట్ర రైతులు కూడా చేరుతున్నారు.  ఈ రాష్ట్రం నుంచి వేల సంఖ్యలో అన్నదాతలు నాసిక్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. బుధవారం మధ్యాహ్నం..

ఆందోళనలో మహారాష్ట్ర రైతులు కూడా ! నాసిక్ నుంచి ఢిల్లీకి ప్రయాణం,  చట్టాల రద్దుకై హర్యానాలో అన్నదాతల హోమం,
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 23, 2020 | 4:48 PM

రైతుల ఆందోళనలో మహారాష్ట్ర రైతులు కూడా చేరుతున్నారు.  ఈ రాష్ట్రం నుంచి వేల సంఖ్యలో అన్నదాతలు నాసిక్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. బుధవారం మధ్యాహ్నం వారు మధ్యప్రదేశ్ చేరుకున్నారు. వీరికి మేధాపాట్కర్ ఆధ్వర్యంలోని నర్మదా బచావ్  ఆందోళన్ సభ్యులు  సాదర స్వాగతం పలికారు. ఇటీవల మేధాపాట్కర్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం గమనార్హం. మరోవైపు కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ హర్యానా కు చెందిన ఆర్య ప్రతినిధి సభ, గోరక్షా దళ్ సభ్యులు, ఇతర అన్నదాతలు హోమం నిర్వహించారు. కేంద్రానికి ఇప్పటికైనా  కనువిప్పు కలగాలని వీరు కోరారు. పంజాబ్, హర్యానా రైతులను కలిసేందుకు యూపీ నుంచి వస్తున్న వందలాది రైతులను మొరాదాబాద్ లో పోలీసులు నిలిపివేశారు. వ్బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు.

అన్నదాతల డిమాండ్లను పట్టించుకోని కేంద్ర వైఖరిని కాంగ్రెస్ నేత శశిథరూర్ దుయ్యబట్టారు. అసలు వారి వాదనలను ఆలకించకుండా చట్టాలను ఆమోదించారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇప్పుడు వారు  ఇన్ని రోజులుగా నిరసన చేస్తున్నా ఈ బీజేపీ సర్కార్ కు చీమ కుట్టినట్టయినా లేదన్నారు. రైతులను ఖలిస్తానీయులుగా, పాకిస్థానీయులుగా, నక్సల్స్ గా ముద్ర వేస్తున్నారని ట్వీట్ చేశారు. మరోవైపు చర్చలకు సిధ్దమంటారా అని శశిథరూర్ ప్రశ్నించారు.

యూపీలో బీజేపీ రాష్ట్ర శాఖ రైతు చట్టాలకు అనుకూలంగా ఇంటింటి ప్రచారం చేబట్టింది. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులకు రాసిన లేఖ ప్రతులను ఈ పార్టీ కార్యకర్తలు పంచుతున్నారు. అటు-కేరళ సీఎం పినరయి విజయన్ ..తమ ప్రభుత్వం రైతుల పక్షానే అని ప్రకటించారు. రైతు చట్టాలకు నిరసనగా  ఓ తీర్మానాన్ని ఆమోదించేందుకు ప్రత్యేక అసెంబ్లీని సమావేశపరచాల్సిందిగా గవర్నర్ ను కోరగా అయన తిరస్కరించడాన్ని విజయన్ తప్పుపట్టారు. గవర్నర్ చర్యను రాజ్యాంగ విరుధ్దమైనదని ఆరోపించారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..