అక్కడ నీళ్లను సైతం వదలని దొంగలు..!

భానుడి భగభగలను సైతం లెక్కచేయక కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకున్న నీళ్లు చోరీకి గురవడం ఆ గ్రామస్తులను ఆవేదన చెందారు. దీంతో నీళ్లు నింపిన డ్రమ్ములకు తాళం వేసి ఒక్కో నీటి బిందువును ఒడిసిపట్టుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా ఝాన్సార్‌ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో నీటి సంక్షోభం ఏర్పడింది. దీంతో ఆ గ్రామస్తులు దాదాపు మూడు కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు మోసుకువస్తున్నారు. అసలే నీటి ఎద్దడి. అంత […]

  • Balaraju Goud
  • Publish Date - 8:03 pm, Thu, 28 May 20
అక్కడ నీళ్లను సైతం వదలని దొంగలు..!

భానుడి భగభగలను సైతం లెక్కచేయక కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకున్న నీళ్లు చోరీకి గురవడం ఆ గ్రామస్తులను ఆవేదన చెందారు. దీంతో నీళ్లు నింపిన డ్రమ్ములకు తాళం వేసి ఒక్కో నీటి బిందువును ఒడిసిపట్టుకుంటున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా ఝాన్సార్‌ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో నీటి సంక్షోభం ఏర్పడింది. దీంతో ఆ గ్రామస్తులు దాదాపు మూడు కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు మోసుకువస్తున్నారు. అసలే నీటి ఎద్దడి. అంత దూరం పోయి నీళ్లను తెచ్చుకోలేని సోమరులు.. రాత్రికి రాత్రే నీటిని మాయం చేస్తున్నారు. దీంతో నీటి దొంగలకు చెక్‌పెట్టాలనుకున్నారు బాధితులు. నీటి డ్రమ్ములకు తాళం వేయడం ప్రారంభించారు. గ్రామంలో నీటి కొరత కారణంగా దూర ప్రాంతాలను నుంచి తెచ్చుకున్న నీటి కాపాడుకోవడానికే తాళం వేస్తున్నామని గ్రామస్తులు చెప్పారు. ఇక గ్రామ ప్రజల సమస్యను జిల్లా ప్రజారోగ్య, ఇంజనీరింగ్‌ విభాగం ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎన్‌ఎస్‌ భిడే దృష్టికి తీసుకువెళ్లగా… వేసవి తీవ్రత వల్ల బోరు ఎండిపోయి, చేతిపంపులు పనిచేయడం లేదన్నారు. త్వరలోనే వాటిని రిపేర్ చేయించి.. ప్రజల సమస్యలు తీరుస్తామన్నారు.