ఒకే ఫ్రేమ్‌లో రెండు ‘చందమామ’లు.. సొగసు చూడతరమా..!

Madam Tussauds Singapore: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చందమామ వ్యాక్స్ స్టాట్యూను రియల్ చందమామ ఆవిష్కరించింది. దక్షిణాది నుంచి ఆ మ్యూజియంలో మైనపు విగ్రహం పొందిన తొలి నటిగా కాజల్ అగర్వాల్ రికార్డ్ సృష్టించింది. ఇవాళ సింగపూర్‌లో జరిగిన ఈ విగ్రహావిష్కరణకు కాజల్ తన కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యింది. అంతేకాక ఆవిష్కరణ అనంతరం స్టాట్యూ‌తో కలిసి చందమామ ఫోటోలకు పోజులు ఇవ్వగా.. అవి ఇప్పుడు […]

ఒకే ఫ్రేమ్‌లో రెండు 'చందమామ'లు.. సొగసు చూడతరమా..!

Madam Tussauds Singapore: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చందమామ వ్యాక్స్ స్టాట్యూను రియల్ చందమామ ఆవిష్కరించింది. దక్షిణాది నుంచి ఆ మ్యూజియంలో మైనపు విగ్రహం పొందిన తొలి నటిగా కాజల్ అగర్వాల్ రికార్డ్ సృష్టించింది.

ఇవాళ సింగపూర్‌లో జరిగిన ఈ విగ్రహావిష్కరణకు కాజల్ తన కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యింది. అంతేకాక ఆవిష్కరణ అనంతరం స్టాట్యూ‌తో కలిసి చందమామ ఫోటోలకు పోజులు ఇవ్వగా.. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోల్డెన్ కలర్ డ్రెస్‌తో ఉన్న ఆ విగ్రహం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉంటే గతంలో తెలుగు ఇండస్ట్రీ నుంచి హీరోలు ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలు కూడా సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం కాజల్ పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘మోసగాళ్లు’ సినిమాలో నటిస్తుంటే.. తమిళంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’.. అలాగే హిందీలో ‘ముంబయి సాగా’ చిత్రాల్లో సందడి చేయనుంది.

Click on your DTH Provider to Add TV9 Telugu