వాతావరణ హెచ్చరిక.. దూసుకొస్తున్న మరో అల్పపీడనం..డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే ఛాన్స్

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో...

వాతావరణ హెచ్చరిక.. దూసుకొస్తున్న మరో అల్పపీడనం..డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే ఛాన్స్
Follow us

|

Updated on: Nov 29, 2020 | 9:12 AM

Low Pressure : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇవాళ, రేపు తెలంగాణలో పొడి వాతావారణం ఉంటుందని అంటున్నారు అధికారులు.

బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. దక్షిణ అండమాన్​ సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తమిళనాడులో రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారనుందని వెల్లడించింది. ఈ ప్రభావం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో డిసెంబర్​ 1 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఈ వాయుగుండం పశ్చిమ దిశగా కదిలి డిసెంబర్​ 2న దక్షిణ తమిళనాడులోని కోస్తా ప్రాంతాన్ని తాకుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనివల్ల మంగళ, బుధవారాల్లో తమిళనాడు, పుదుచ్చెరిలో కరైకల్​, మహే, లక్షద్వీప్​, ఆంధ్రప్రదేశ్​లోని దక్షిణ తీరం, దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. తమిళనాడు, పుదుచ్చెరి, కరైకల్​లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.