అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకుని కలిసుందామనుకున్నారు.. అంతలోనే..

అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకుని కలిసుందామనుకున్నారు.. అంతలోనే..
lovers suicide

పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.

Balaraju Goud

|

Jan 15, 2021 | 1:39 PM

గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నూరేళ్లు కలిసుందామనుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యకు యత్నించారు. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లగుంట గ్రామ సమీపంలోని దేవాదుల పైప్ లైన్ వద్ద శుక్రవారం ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నట్లగుంట గ్రామానికి చెందిన 21ఏళ్ల యువకుడు, భూపాలపల్లికి చెందిన 17ఏళ్ల యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని కలకాలం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇక్కడ కూడా అందరిలాగే అదే సీన్ రిఫిట్ అయ్యింది. అమ్మాయి కుటుంబసభ్యులు వీరి వివాహానికి ససేమిరా అన్నారు. నిన్న నల్లగుంటలోని బంధువుల ఇంటికి వచ్చిన యువతిని శుక్రవారం ఉదయం యువకుడు కలిశాడు. అనంతరం ఇద్దరు కలిసి గ్రామ శివారులోని దేవాదుల పైప్ లైన్ ప్రాంతానికి వెళ్లి… పురుగులమందు తాగి బలవన్మరణానికి యత్నించారు.

ఇది గమనించిన స్థానికులు.. ఇద్దరిని ములుగు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మల్లంపల్లిలోని ప్రైవేటు క్లినిక్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also…. అడ్డదారిలో ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాందించాడు.. అధికారుల తనిఖీలో అడ్డంగా బుక్కయ్యాడు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu