Bengaluru Earthquake: భారీ వింత శబ్ధాలతో ఉలిక్కి పడ్డ బెంగళూరు.. మరికొన్ని ప్రాంతాల్లోనూ శబ్ధాల కలకలం..

కర్ణాటక రాజధాని బెంగళూరు మరోసారి భారీ వింత శబ్ధాలతో ఉలిక్కిపడింది. శుక్రవారంమధ్యాహ్నం 12 గంటల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వింత శబ్ధాలు వినిపించాయి

Bengaluru Earthquake: భారీ వింత శబ్ధాలతో ఉలిక్కి పడ్డ బెంగళూరు.. మరికొన్ని ప్రాంతాల్లోనూ శబ్ధాల కలకలం..
Follow us

|

Updated on: Nov 26, 2021 | 4:55 PM

కర్ణాటక రాజధాని బెంగళూరు మరోసారి భారీ వింత శబ్ధాలతో ఉలిక్కిపడింది. శుక్రవారంమధ్యాహ్నం 12 గంటల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వింత శబ్ధాలు వినిపించాయి. దీంతో నగరవాసులు ఆందోళనకుగురయ్యారు. ‘ భూకంపమేమన్నా వచ్చిందా?’, ‘అసలేం జరుగుతోంది’ అంటూ పలువురు సోషల్‌ మీడియా పోస్టులతో హోరెత్తించారు. ఒక్క బెంగళూరులోనే కాదు మండ్య, రామనగర జిల్లాల్లోనూ ఈ వింత శబ్ధాలు వినిపించాయి. ఇవి భూకంపం వల్ల సంభవించిన శబ్ధాలా? లేక సూపర్ సోనిక్ బూమ్‌ సంకేతాలా?అన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ అక్కడి ప్రజలు నెట్టింట్లో పోస్టులు పెట్టారు. ‘ఇప్పుడే బెంగళూరులోని రాజరాజేశ్వరి నగరలో భారీ శబ్ధం వినిపించింది. ఇంటి తలుపులు, కిటికీలు ఊగిపోయాయి. నాకొక్కడికేనా లేక ఇంకా ఎవరికైనా ఇలా అనిపించిందా..?’ అని ఓ నెటిజన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టాడు.

గతంలోనూ..

అయితే ఈ శబ్ధాలకు, భూప్రకంపనలకు సంబంధం లేదని ప్రకృతి విపత్తుల విభాగం స్పష్టం చేసింది.’శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వింత శబ్ధాలు వినిపించినట్లు రిపోర్ట్స్‌ వచ్చాయి. వీటిని మేము సెసిమిక్ అబ్జర్వేటరీలతో విశ్లేషించాం.. ఎటువంటి భూకంప సంకేతాలు కనిపించలేదు’ అని కర్ణాటక రాష్ట్ర ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం(KSNDMC) వెల్లడించింది. దీంతో కర్ణాటక వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మిస్టరీ సౌండ్స్‌కు కారణమేమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. బెంగళూరులో ఇలాంటి భారీ వింత శబ్ధాలు వినిపించడం ఇదేమి మొదటిసారికాదు. గతేడాది మే నెలలో కూడా ఇలాంటి భారీ శబ్ధాలు వినిపించాయి. అయితే యుద్ధ విమానం టేకాఫ్ కారణంగానే ఈ శబ్ధం వచ్చినట్లు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్పష్టం చేసింది. ఇక ఈ ఏడాది జులైలోనూ బెంగళూరు నగరంలోనూ భారీ శబ్ధాలు వినిపించాయి.

Also Read:

Cryptocurrency: క్రిప్టోకరెన్సీల చట్టం తీసుకురావడం సాధ్యమేనా? పార్లమెంట్‌లో బిల్లు ఏ రకంగా ఉండొచ్చు..నిపుణులు ఏమంటున్నారు?

PM Gati Shakti: భారతదేశ గతిని మార్చేసే పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్ రెడీ.. ఎన్ని ప్రాజెక్టులు రానున్నాయంటే?

Eggs Attack: ఒడిశాలో కొనసాగుతోన్న కోడిగుడ్ల రాజకీయం.. నిన్న సీఎం.. నేడు మహిళా ఎంపీలపై దాడులు..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్