చరిత్రలో తొలిసారిగా.. పదిరోజుల పాటు భక్తులకు అవకాశం, రేపటి నుంచే తిరుమలేశుని వైకుంఠ ద్వార దర్శనం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ధనుర్మాస పర్వదిన సమయాన...

  • Venkata Narayana
  • Publish Date - 1:55 pm, Wed, 23 December 20
చరిత్రలో తొలిసారిగా.. పదిరోజుల పాటు భక్తులకు అవకాశం, రేపటి నుంచే తిరుమలేశుని వైకుంఠ ద్వార దర్శనం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ధనుర్మాస పర్వదిన సమయాన డిసెంబర్ 25న అర్ధరాత్రి 12.05 నుంచి 1.30 గంటల వరకు స్వామికి కైంకర్యాలు నిర్వహిస్తారు. అనంతరం వేకువ జామున 4.30గంటల నుంచి భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు. కాగా చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది పదిరోజుల పాటు వైకుంఠ దర్శనం కల్పించనున్నారు.