ఆగస్టు 5 న న్యూయార్క్ లో కనిపించనున్న ‘అయోధ్యా రాముడు’

ఆగస్టు 5 న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్న నేపథ్యంలో.. దీనినొక చరిత్రాత్మక ఘటనగా మలిచేందుకు నిర్వాహకులు యోచిస్తున్నారు. ఆ రోజున న్యూయార్క్ లోని టైమ్స్ స్క్యేర్ లో..

ఆగస్టు 5 న న్యూయార్క్ లో కనిపించనున్న 'అయోధ్యా రాముడు'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 30, 2020 | 4:42 PM

ఆగస్టు 5 న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్న నేపథ్యంలో.. దీనినొక చరిత్రాత్మక ఘటనగా మలిచేందుకు నిర్వాహకులు యోచిస్తున్నారు. ఆ రోజున న్యూయార్క్ లోని టైమ్స్ స్క్యేర్ లో ప్రధాన వీధులన్నీ శ్రీరాముడి నిలువెత్తు 3 డీ చిత్రాలతో నిండిపోనున్నాయి. అలాగే అయోధ్యలోని ఆలయ నమూనాను కూడా భారీ పోర్ట్రైట్లతో హైలైట్ చేయనున్నామని .  బిల్ బోర్డులన్నీ వీటితో కళకళలాడనున్నాయని అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడు జగదీష్ సెహ్వానీ ప్రకటించారు. ఇందుకు ఏర్పాట్లన్నీ చురుకుగా సాగుతున్నాయన్నారు.

17 వేల చదరపు అడుగుల ఎత్తయిన ఎల్ ఈ డీ డిస్ ప్లే స్క్రీన్ తో బాటు ఇక్కడి ఇతర స్క్రీన్లను కూడా ఇందుకు వినియోగిస్తామని, ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు ‘జై శ్రీరామ్’ అనే పదాలు హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈ స్క్రీన్లలో కనిపించేలా చూస్తామని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ భూమి పూజ చేస్తున్న ఫోటోలు, ఇమేజీలను దాదాపు నగరమంతా ప్రదర్శించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని జగదీష్ సెహ్వానీ పేర్కొన్నారు.’ మోదీ హయాంలో రామాలయ నిర్మాణం జరగడం ఓ అద్భుత ఘట్టం.. ఇన్నాళ్లకు ప్రజల కల తీరబోతోంది.. ఆరేళ్ళ క్రితం కూడా ఇలాంటి రోజు వస్తుందని మేం ఊహించలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..