లాక్‌డౌన్ అలా కలిసొచ్చింది.. శరవేగంగా పనులు

లాక్ డౌన్ విధింపుతో దేశంలో ఇబ్బందులు ఎదుర్కొని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. కానీ అదే లాక్ డౌన్ చిరకాలంగా పెండింగ్‌లో పడిన లేదా నత్తనడకన కొనసాగుతున్న కొన్ని ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది సాక్షాత్తు హైదరాబాద్ నగరంలోని సాధ్యమైంది.

లాక్‌డౌన్ అలా కలిసొచ్చింది.. శరవేగంగా పనులు
Follow us

|

Updated on: Apr 29, 2020 | 7:04 PM

లాక్ డౌన్ విధింపుతో దేశంలో ఇబ్బందులు ఎదుర్కొని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. కానీ అదే లాక్ డౌన్ చిరకాలంగా పెండింగ్‌లో పడిన లేదా నత్తనడకన కొనసాగుతున్న కొన్ని ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది సాక్షాత్తు హైదరాబాద్ నగరంలోని సాధ్యమైంది. లాక్ డౌన్ కారణంగా రోడ్ల మీద జన సంచారం బాగా తగ్గిపోవడంతో రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నారు.

హైదరాబాద్ మహానగరంలో సుమారు 30 వేల కోట్ల రూపాయల వ్యయంతో జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, స్కై వేలు, బీటీ రోడ్లు, వీడీసీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తలసాని అంటున్నారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్‌తో కలిసి మంత్రి తలసాని.. నెక్లెస్ రోడ్ లో 26 కోట్ల రూపాయలతో ఆరు కిలోమీటర్ల మేర చేపట్టిన వీడీసీసీ రోడ్డు పనులు, సికింద్రాబాద్ బోట్స్ క్లబ్ వద్ద 25 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న డ్రైనేజి పనులను పరిశీలించారు. కవాడిగూడలో కొనసాగుతున్న సివరేజ్ లైన్ పనులను మంత్రి సమీక్షించారు.

లాక్ డౌన్ కారణంగా రహదారులపై వాహనాల రద్దీ లేకపోవడం, జన సంచారం బాగా తగ్గిపోవడం వల్ల రహదారుల నిర్మాణం ఎంతో వేగంగా సాగుతోందని, ప్రజలు ఊహించని విధంగా నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తలసాని చెబుతున్నారు. కరోనా నియంత్రణ చర్యలు ఒకవైపు చేపడుతూనే.. మరో వైపు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లాక్ డౌన్ పీరియడ్ ముగిసేనాటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపట్టిన పలు రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులు, ఫ్లైఓవర్ నిర్మాణాలు దాదాపు పూర్తి అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Read this: అలా చేస్తేనే డ్యూటీకి రండి!.. ఉద్యోగులకు కేంద్రం షరతు

Read this:  రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగింపు 

Read this:  ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపు

Read this:  కరోనా కేసుల సంఖ్యలో ఏదో మతలబు.. బండి డౌట్

Read this:  ఉద్యోగులపై కార్మికుల దాడి.. ఐఐటీలో టెన్షన్..టెన్షన్

Read this:  మే 3 తర్వాత లాక్‌డౌన్ కొనసాగింపు.. కిషన్‌రెడ్డి క్లారిటీ

Read this:  కష్ట కాలంలోనూ వసూళ్లే.. మీరిక మారరా?

Read this:  సర్కార్ చెప్పిన పంటల్ని వేయాలి.. రైతులకు కెసిఆర్ ఆదేశం

Read this:  కల్లు ప్రియులకు శుభవార్త.. ఏపీలో గ్రీన్ సిగ్నల్!

Read this:  గవర్నర్‌పై గుస్సా.. దీక్షకు దిగిన మంత్రి

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే