తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని.. స్తంభానికి కట్టేసి కొట్టిన గ్రామస్తులు

ఏపీలో అమానుష ఘటన జరిగింది. కృష్ణా జిల్లాలో తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని తండ్రికొడుకులకు దేహాశుద్ధి చేశారు.

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని.. స్తంభానికి కట్టేసి కొట్టిన గ్రామస్తులు
Follow us

|

Updated on: Nov 07, 2020 | 2:31 PM

ఏపీలో అమానుష ఘటన జరిగింది. కృష్ణా జిల్లాలో తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని తండ్రికొడుకులకు దేహాశుద్ధి చేశారు. అప్పు తీర్చలేదని ఓ వ్యక్తిని స్తంభానికి కట్టేసి చితకబాదారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన వీడియోతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నూజివీడు మండలం దేవరగుంటలో మాజీ వైస్‌ ఎంపీపీ తాళం వెంకటేశ్వరరావు, ఆయన తనయుడిని విద్యుత్తు స్తంభానికి కట్టేసి కొట్టిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. వెంకటేశ్వరరావు తన బంధువులు, మరికొందరు గ్రామస్థుల నుంచి సుమారు రూ.15 లక్షల వరకు అప్పు తీసుకున్నారు. అసలు, వడ్డీ చెల్లించలేదని అప్పు ఇచ్చిన వారు గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. దీంతో అందరికీ సర్దుబాటు చేసేందుకు రూ.20 లక్షలు చెల్లించాలని పెద్దలు తీర్పు ఇచ్చారు.

అయితే, గడువు ముగిసినా బకాయి చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారు అతడిని నిలదీశారు. అతను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడిని విద్యుత్తు స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ వ్యవహారాన్ని సంబంధించి వీడియో తీసిన గ్రామస్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన రూరల్‌ పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ‘గ్రామంలో గొడవ జరిగిన మాట వాస్తవమే. బాధితుడైన వెంకటేశ్వరరావు… అది మా వ్యక్తిగత వ్యవహారం.. పోలీసులకు ఎటువంటి సంబంధం లేదని లేఖ ఇచ్చారని రూరల్ ఎస్‌ఐ పేర్కొన్నారు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు