Live Reporting Encounter:మాట జారితే.. అంతే సంగతులు

ఫిబ్రవరి 19.. ముందు రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను మరింత ముమ్మరం చేశాయి. ఆ ఎన్‌కౌంటర్లో ఒక ఆర్మీ అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. క్రాస్ ఫైరింగ్‌లో ఒక సివిలియన్ కూడా చనిపోయాడు. అక్కడికి వెళ్లి, తాజా పరిస్థితిని రిపోర్ట్ చేయాలని అనుకున్నాను.

Live Reporting Encounter:మాట జారితే.. అంతే సంగతులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2020 | 11:41 AM

Live Reporting Encounter:ఫిబ్రవరి 19.. ముందు రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను మరింత ముమ్మరం చేశాయి. ఆ ఎన్‌కౌంటర్లో ఒక ఆర్మీ అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. క్రాస్ ఫైరింగ్‌లో ఒక సివిలియన్ కూడా చనిపోయాడు. అక్కడికి వెళ్లి, తాజా పరిస్థితిని రిపోర్ట్ చేయాలని అనుకున్నాను. శ్రీనగర్ మిత్రుడు మెహరాజ్ అహ్మద్ మాత్రం గ్రామంలో అందరూ ఆగ్రహావేశాలతో ఉంటారని, అందులో ఒక సివిలియన్ చనిపోవడంతో మరింత ఉద్రిక్తంగా అక్కడి పరిస్థితులు ఉంటాయని చెప్పాడు. ఒకరకంగా చెప్పాలంటే వెళ్లడం మంచిది కాదు అని సున్నితంగా వారించాడు. కానీ తప్పదు వెళ్లాల్సిందే అని పట్టుబట్టగా.. కొన్ని జాగ్రత్తలు చెప్పాడు.

గ్రామంలో ఎన్‌కౌంటర్ జరిగిన ఇంటికి దాదాపు అర కిలోమీటర్ దూరం నుంచి భారీ జనసందోహం ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం అక్కడికి వచ్చి ఉన్నారు. క్రాస్ ఫైర్‌లో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు ఓవైపు, ఎన్‌కౌంటర్‌లో పూర్తిగా తగలబడిపోయిన 3 ఇళ్లు మరోవైపు జనంతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. నష్టపోయిన కుటుంబాల కోసం అప్పటికే జోలె పట్టి నిధులు సేకరిస్తున్నారు. వచ్చినవారు తమకు తోచినంత ఇస్తున్నారు. మేం చేరుకునే సరికే రూ. 15 లక్షల వరకు పోగైందని చెప్పారు. కానీ మమ్మల్ని చూడగానే అక్కడున్న జనంలో యువత తీవ్రమైన ఆగ్రహం, ఉద్రేకంతో ఊగిపోయారు. నా కెమేరామన్‌ రమేశ్ కూడా మాబ్ మూడ్‌కి తగ్గట్టు నడచుకోవడంలో అనుభవం ఉన్నవాడే కావడంతో, కెమేరా కిందికే ఉంచి ముందు వాళ్లతో మాట్లాడి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఇద్దరం కలిసి మేం మిగతా హిందీ ఛానెళ్ల మాదిరి కాదని, రెండు పక్షాల వాదనను న్యూస్ లో టెలీకాస్ట్ చేస్తామని చెప్పాం. “మీరు అలాగే చెబుతారు, కానీ మీరు మొత్తం పంపినా సరే, పైనున్నవాళ్లు ఎడిటింగ్ చేసి మేం చెప్పిందేదీ రాకుండా చేస్తారు” అన్నారు.

“మీకు మామీద నమ్మకం లేకపోతే నేను ఇక్కణ్ణుంచి లైవ్ ఇస్తాను. లైవ్‌లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అదే చెప్పండి. ఎలాంటి ఎడిటింగ్ లేకుండా టెలీకాస్ట్ అవుతుంది. టెలీకాస్ట్ అయ్యిందో లేదో మీరే నేరుగా చూసుకోవచ్చు” అంటూ టీవీ తెలుగు యూట్యూబ్ లింక్ ఓపెన్ చేసి చూపించాను. ఆ సమయానికి మొబైల్ ఇంటర్నెట్ పునరుద్ధరించడం వల్ల తదుపరి బులెటిన్లో నా లైవ్ ఉంటుందని అసైన్మెంట్ నుంచి ఫోన్ చేసి చెప్పడంతో నేను వారికి ఆ హామీ ఇచ్చేశాను. అనుకున్నట్టే తదుపరి బులెటిన్లో లైవ్‌ కోసం ఫోన్ కాల్ వచ్చింది. సగం కూలిపోయిన ఇంటి పైకప్పు మీద నిలబడి, లైవ్ రిపోర్టింగ్ మొదలు పెట్టాను. మాట్లాడాలనుకున్న వ్యక్తుల్లో కొందరు తమ ముఖాలకు కర్చీఫ్ అడ్డంగా కట్టుకుని తమ ఐడెంటిటీ బయటపడకుండా జాగ్రత్త పడుతూ లైవ్‌లో మాట్లాడారు. పక్కనున్నవారు అదంతా యూట్యూబ్‌లో టీవీ తెలుగు లైవ్ చూస్తున్నారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర పదజాలం ఉపయోగిస్తూ వాళ్లు మాట్లాడిన మాటలు నాకేమాత్రం ఇష్టం లేకపోయినా, లైవ్ రిపోర్టింగ్ కదా.. తప్పలేదు. కాకపోతే ఆ లైవ్, వారిలో నమ్మకాన్ని కలిగించింది. ఆ తర్వాత వాళ్లే మా ఇద్దరినీ తీసుకెళ్లి అక్కడ జరిగిన నష్టం అంతా వివరిస్తూ “భాయ్ సాహబ్, యే భీ షూట్ కరో, యే భీ లేలో” అంటూ అన్ని మూలలకూ తీసుకెళ్లారు. కాల్పుల్లో బుల్లెట్ తగిలి గాయపడ్డ ఆవును చూపిస్తూ.. “మోదీ సర్కార్ ఆవును పవిత్రంగా భావిస్తుంది. మరి ఆర్మీ ఈ మూగజీవం మీదకు ఎలా కాల్పులు జరపగలిగింది?” అంటూ ప్రశ్నించారు.

ఈలోపు అక్కడికి అప్పుడే చేరుకున్న మరికొంత మంది యువకులు మమ్మల్ని మళ్లీ ప్రశ్నించడం మొదలు పెట్టారు. అయితే అప్పటికే మా మీద నమ్మకం ఏర్పర్చుకున్న యువకులు “వీళ్లు మనకు వ్యతిరేకులు కాదు” అని అర్థం వచ్చేలా కశ్మీరీ భాషలో వారికి సర్దిచెప్పారు. అయినా సరే, కొందరు “మీ పేర్లు చెప్పండి.. ఐడీ కార్డులు చూపించండి.. మీరు మీడియా ముసుగులో ఉన్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు కదా?” అంటూ దాదాపు కాలర్ పట్టుకున్నంత పని చేస్తూ నిలదీశారు. సహనంతో వారికి ఐడీ కార్డులు చూపించి, మళ్లీ పాత కథంతా వివరించి చెప్పాం. హైదరాబాదీ అని చెప్పడం వాళ్లందరిలో చాలావరకు సానుకూలతను తీసుకొచ్చింది. మొత్తానికి ఎలాగోలా.. అక్కడ చేయాల్సిన షూటింగ్ పూర్తి చేసి బయటపడ్డాం.

మేం శ్రీనగర్ సిటీ చేరుకునే సమయానికి హైదరాబాద్ నుంచి బయల్దేరిన హసీనా, దేవి నాగవల్లి శ్రీనగర్ చేరుకోవడం, వేర్వేరు వాహనాలు మాట్లాడుకుని తలా ఓవైపుకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. అయితే కమ్యూనికేషన్ గ్యాప్‌తో నేను కవర్ చేసి వచ్చిన పింగ్లాన్ గ్రామం (ఎన్‌కౌంటర్ స్పాట్)కు దేవి నాగవల్లి మరో కెమేరామన్ రమేశ్‌తో చేరుకున్నట్టు తెలిసింది. అక్కడి జనం ఆగ్రహంతో కెమేరామన్ రమేశ్ దగ్గరున్న కెమేరా లాక్కుని విసిరేశారని చెప్పారు. అదృష్టావశాత్తు అది వర్షం కారణంగా మెత్తబడ్డ నేలపై పడడంతో లెన్స్ పగిలిపోలేదు. ఒకట్రెండు భాగాలు దెబ్బతిన్నా షూటింగ్‌కు ఇబ్బంది లేని కండిషన్‌లోనే ఉంది.

ఇంతకీ అక్కడి వారికి ఆగ్రహం తెప్పించిన అంశం ఏంటంటే.. ఒక్క పదం.. దేవి నాగవల్లి మాక్ లైవ్ చేస్తూ ఉగ్రవాదుల గురించి చెప్పాల్సిన చోట “ఆతంక్‌వాదీ” అన్న హిందీ పదం ఉపయోగించడమే వారి ఆగ్రహానికి కారణమైంది. నిజానికి భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాదులను కశ్మీర్ లోయలో స్థానికులు స్వాతంత్ర సమరయోధులుగా భావిస్తారు. బాహ్య ప్రపంచానికి అక్కడ జరుగుతున్నది ఒక స్వాతంత్ర పోరాటమని, భారత ప్రభుత్వం వారు కోరుతున్న స్వాతంత్ర్యం ఇవ్వకుండా బలవంతంగా అణచివేస్తోందని నమ్మించే ప్రయత్నంలో భాగంగా వేర్పాటువాదులు స్థానికుల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలిస్తూ ఉంటారు. కశ్మీర్ విడిగా ప్రత్యేక దేశంగా ఉంటే స్విట్జర్లాండ్ తరహాలో అభివృద్ధి చెందేది అన్న భావన వారిలో నూరిపోస్తారు. వేర్పాటువాదులకు పాకిస్తాన్ నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతూనే ఉంటాయి. సహజంగానే యువత ఈ తరహా భావజాలానికి భావోద్వేగంతో ఆకర్షితులవుతారు. ఉగ్రవాద మూకలు సరిగ్గా ఆ భావోద్వేగానికి తుపాకులు అందించి వారిని సైతం ఉగ్రవాదులుగా మార్చేస్తుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఇలా ఉంటే.. అక్కడ పొరపాటున “ఆతంక్‌వాదీ” అన్నామంటే మనల్ని చంపడానికి కూడా వెనుకాడరు. మరి ఏమని పిలవాలి? అంటే.. షహీద్ (స్వాతంత్ర సమరయోధుడు) అని పిలవాలి అంటారు. అలాగే భద్రతాబలగాలు “చంపేశాయి” అని చెప్పినా ఒప్పుకోరు. భారత బలగాలతో పోరాడి “అమరులు” అయ్యారని చెప్పాలంటారు. అక్కడి వారికి మాతృభాష కశ్మీరీతో పాటు హిందీ, ఇంగ్లిష్ చక్కగా మాట్లాడగలరు. అందుకే ఆ రెండు భాషల్లో జనం మధ్య నిలబడి లైవ్ రిపోర్టింగ్ చేయాలంటే ప్రాణాలమీదకు తెచ్చుకోవడమే అవుతుంది. మేం ఉపయోగించే తెలుగులోనూ ఎక్కడా వారికి అనుమానం కలుగని రీతిలో “ముష్కరులు, ఉగ్రవాదులు” వంటి పర్యాయ పదాలు ఉపయోగిస్తూ లైవ్ లేదా మాక్ లైవ్ రికార్డింగ్ చేసుకుంటూ ముందుకు సాగిపోయాం. ఆ తర్వాత ఉరి బోర్డర్, గుల్‌మార్గ్, బారాముల్లా, సోపోర్ వంటి ప్రాంతాలన్నీ తిరిగి అనేక కథనాలు అందించాం. అత్యంత క్లిష్ట భౌగోళిక, వాతావరణ పరిస్థితుల్లో భద్రతా బలగాల విధి నిర్వహణ, వాళ్లు ఎదుర్కొనే సవాళ్లపై సమగ్ర కథనాలు రూపొందించాం.

ఇదంతా నాణేనికి ఒక వైపు.. పర్యాటకులు తమకు అతిథులతో సమానమని కశ్మీరీలు చెబుతారు. పర్యాటకులను వారు ఎంతో అభిమానంతో, వారి బంధువుల్లాగే చూసుకుంటారు. గోదావరి జిల్లాలు – కోనసీమ వాసులకు ఏమాత్రం తీసిపోని విధంగా అతిథి మర్యాదలు కూడా చేస్తారు. అయితే ఇదంతా బయటి ప్రపంచం దృష్టిలో మార్కులు కొట్టేయడానికి వాళ్లు ఆడే దొంగ నాటకమని అక్కడ చాలా కాలం నుంచి పనిచేస్తున్న ఆర్మీ – పోలీసు అధికారులు చెబుతుంటారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. కశ్మీరీల ఆతిథ్యం, పరమత సహనం కారణంగానే కశ్మీరియత్ పదం పుట్టిందని ఓ నానుడి. కానీ కశ్మీరీ పండిట్ల ఊచకోత ఉదంతం కశ్మీరియత్‌పై రక్తపు మరకలతో వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదు. అది వారిని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..