మద్యం కోసం బోర్డర్ దాటుతున్న మందు బాబులు

ఏపీలో మద్యం సరిగ్గా దొరక్కపోవడం, దొరికినా తమకు కావాల్సిన బ్రాండ్ లేకపోవడంతో మందుబాబులు ఏకంగా బోర్డర్ దాటేస్తున్నారు. ఇదే అదనుగా తెలంగాణ బోర్డర్‌లో కొత్తగా బెల్టు షాపులు వెలుస్తున్నాయి. బెల్టు షాపుల్లో కూర్చుని మద్యం సేవించడం మరింత మజాగా..

మద్యం కోసం బోర్డర్ దాటుతున్న మందు బాబులు
Follow us

|

Updated on: Jun 11, 2020 | 12:59 PM

ఏపీలో మద్యం సరిగ్గా దొరక్కపోవడం, దొరికినా తమకు కావాల్సిన బ్రాండ్ లేకపోవడంతో మందుబాబులు ఏకంగా బోర్డర్ దాటేస్తున్నారు. ఇదే అదనుగా తెలంగాణ బోర్డర్‌లో కొత్తగా బెల్టు షాపులు వెలుస్తున్నాయి. బెల్టు షాపుల్లో కూర్చుని మద్యం సేవించడం మరింత మజాగా మారడంతో మందుబాబులు రాష్ట్ర సరిహద్దులు దాటి మద్యపానంతో తరించిపోతున్నారు.

ఏపీలోని కృష్ణ జిల్లా, తెలంగాణలోని ఖమ్మం జిల్లా బోర్డర్‌లో రెండు వైపులా భారీ సంఖ్యలో బెల్ట్ షాపులు ఓపెన్ చేశారు. రాజకీయా నాయకుల అండతో రెచ్చిపోతున్న లిక్కర్ మాఫియా ఎక్కడ పడితే అక్కడ బెల్టు షాపులు పెట్టేస్తున్నారు. ఈ బెల్టు షాపుల్లో మందు కొట్టేందుకు పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మందుబాబులు వస్తుండడంతో తమ గ్రామాల్లోకి ఎక్కడ కరోనా ఎంటరవుతుందోనన్న భయంతో పలువురు వణికిపోతున్నారు.

కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలోని అనంతవరం,చంద్రగూడెం గ్రామాల్లో ప్రజలు పాట్లు పడుతున్నారు. మంచినీళ్ళ బావుల దగ్గర పోకిరిగాళ్ల చేష్టలతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. మందు బాబులకు షాక్ కొట్టేలా దశలవారీగా మధ్యపాన నిషేధం అమలు చేస్తా అన్న ముఖ్యమంత్రి మద్యం ధరలను 75 శాతం పెంచారు. ఇదే అదనుగా కొంతమంది వ్యాపారులు కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ మద్యం ఆంధ్రా మందుబాబులకు విక్రయిస్తున్నారు. తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా వుండడంతో దానికి అదనంగా భారీ లాభం కలుపుకుని.. ఆంధ్రా మందుబాబులకు విక్రయిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా బెల్టు షాపులు తెరిచేశారు.

అసలే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాండ్ల కొరత, దీనికి తోడు కంటైన్మెంట్ జోన్లలో మద్యం షాపులు మూత, మరో పక్క మద్యం ధరల మోత. కావల్సిన బ్రాండ్ మందు ఆంద్రప్రదేశ్‌తో పోలిస్తే తక్కువ ధరకు తెలంగాణలో దొరకడంతో.. ఆంధ్ర ప్రాంతంలో పలు పార్టీలకు సంబందించిన నాయకులే తెలంగాణ మద్యంతో వ్యాపారం మొదలుపెట్టారని బహిరంగంగానే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణ జిల్లా.. ఖమ్మం బోర్డర్‌లో ఉన్న అనంతవరం గ్రామంలో పెద్ద ఎత్తున మద్యం దందా కొనసాగుతోంది.

మద్యం తరలింపులో తెలంగాణా సరిహద్దు దాటి ఆంధ్రలోకి వస్తే పోలీసుల కేసులు ఎదుర్కోవాలి కాబట్టి.. తెలంగాణ బోర్డర్‌లోని భూముల్లో కొత్తగా బెల్టు షాపులు ఏర్పాటు చేస్తే.. అక్కడే తాగించి సొమ్ము చేసుకోవచ్చనేది అక్రమార్కుల ఆలోచన. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా.. తెలంగాణలోని వ్యవసాయ భూముల్లో కొత్తగా బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. తెలంగాణ మద్యాన్ని అక్కడే తాగి… ఆ తర్వాత తీరికగా ఏపీలోకి వచ్చే ఏర్పాట్లు చేశారు.

దాంతో ఆంద్ర సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ ప్రాంత పంటభూములకు డిమాండ్ పెరిగింది. వ్యవసాయం చేయాల్సిన భూముల్లో బెల్ట్ షాపులు తెరుచుకున్నాయి. సరిహద్దు వెంటే ఉండడంతో ఆంధ్ర నుండి తెలంగాణకు మందుబాబులు క్యూ కడుతున్నారు. కూర్చోబెట్టి తాగిస్తుండడంతో అక్కడే తాగి ఊగూతూ ఎంజాయ్ చేస్తున్నారు. మద్యానికి ఉన్న డిమాండ్‌ని పసిగట్టిన వ్యాపారస్తులు రోడ్డు మార్గం గుండా కాకుండా పడవలో మద్యం తరలిస్తున్నారు.

కృష్ణాజిల్లాని ఆనుకుని తెలంగాణ సరిహద్దు ఎక్కువ మేర ఉండడంతో రవాణా సంగతి ప్రక్కన పెట్టి అక్కడే మద్యాన్ని సేవించడానికి మందుబాబులు పరుగులు పెడుతున్నారు. దీనికి తోడు బెల్ట్ షాప్ నిర్వాహకులు క్వార్టర్ కొంటే వాటర్, గ్లాస్ ఫ్రీ అంటూ ఆఫర్ పెట్టడంతో తక్కువ ఖర్చుతో పనైపోతుందని తెలంగాణకు పయనమవుతున్నారు. ఎంతలా ఈ వ్యాపారం జరుగుతుందంటే ఏకంగా కృష్ణా జిల్లానే కాక గుంటూరు జిల్లా నుండి కూడా ఇక్కడకు మందు బాబులు చేరుకునేంతగా వ్యాపారం కొనసాగుతోంది.

పల్లెటూర్లు కావడంతో కనీసం బావి దగ్గర మంచినీళ్ళు కూడా తెచ్చుకోలేక పోతున్నామని బావురుమంటున్నారు మహిళలు. డ్రంక్ అండ్ డ్రైవ్ లేక పోవడంతో మద్యం సేవించేందుకు దర్జాగా బెల్ట్ షాపుల బాట పడుతున్నారు మందుబాబులు. పోలీసులకు కూడా ఇది తలనొప్పిగానే మారింది. ఆంధ్రలోకి అక్రమంగా మద్యం తరలిస్తే పట్టుకోవచ్చు కానీ తెలంగాణలోకి వెళ్ళి తాగొస్తే ఏం చేయాలంటున్నారు పోలీసులు.

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..