బైకుపై ఇద్దరు..ఎదురుగా సింహం.. ఏం జరిగిందంటే..?

సింహాలకు అడ్డా గుజరాత్ గిర్ అడవులు. అక్కడ నిత్యం సింహాలు గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. ఈ సింహాలను చూసేందుకు చాలామంది జంతుప్రేమికులు ఈ అడవుల సమీపంవరకు వెళతారు. తాజాగా గిర్‌ జాతీయ పార్కులోని ఓ మట్టి రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా.. రెండు కూనలతో కలిసి ఓ సింహం హఠాత్తుగా ఎదురుపడింది. ఆ ఇద్దరిపై ప్రాణాలు పైనే పోయినట్టున్నాయ్‌! చేసేదేమీలేక బైకును నిలిపేశారు. అంతలో సింహం ఏం ఆలోచించిందో ఏమో.. బైకర్లకు దారిచ్చి కూనలతో కలిసి […]

బైకుపై ఇద్దరు..ఎదురుగా సింహం.. ఏం జరిగిందంటే..?

సింహాలకు అడ్డా గుజరాత్ గిర్ అడవులు. అక్కడ నిత్యం సింహాలు గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. ఈ సింహాలను చూసేందుకు చాలామంది జంతుప్రేమికులు ఈ అడవుల సమీపంవరకు వెళతారు. తాజాగా గిర్‌ జాతీయ పార్కులోని ఓ మట్టి రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా.. రెండు కూనలతో కలిసి ఓ సింహం హఠాత్తుగా ఎదురుపడింది. ఆ ఇద్దరిపై ప్రాణాలు పైనే పోయినట్టున్నాయ్‌! చేసేదేమీలేక బైకును నిలిపేశారు.

అంతలో సింహం ఏం ఆలోచించిందో ఏమో.. బైకర్లకు దారిచ్చి కూనలతో కలిసి పక్కకు తప్పుకొని వెళ్లిపోయింది. దీంతో వారిద్దరూ బతుకుజీవుడా అని బయటపడ్డారు. ఈ వీడియోను రాజ్యసభ ఎంపీ పరిమల్‌ నత్వానీ ట్విటర్‌లో పోస్టు చేయడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

[svt-event date=”05/02/2020,1:07AM” class=”svt-cd-green” ]

[/svt-event]

Click on your DTH Provider to Add TV9 Telugu