పాన్-ఆధార్ అనుసంధానానికి మార్చి 31 చివరి తేదీ

పన్ను ఎగవేతను అరికట్టే విషయంలో ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పాన్ కార్డుకు చాలా ప్రాధాన్యముంది. ఐటీఆర్ దాఖలు చేయాలంటే ఆధార్, పాన్ అనుసంధానం తప్పనిసరి. దీనికి 2019 మార్చి 31 చివరి తేదీ. ఈలోపు పాన్ కార్డు కలిగిన వారు వారి పాన్ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. ఒకవేళ మీరు మీ ఆధార్, పాన్ కార్డును అనుసంధానం చేసుకోకపోతే మీ పాన్ కార్డు పనిచేయకపోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏఏ ప్రకారం […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:19 pm, Mon, 18 March 19
పాన్-ఆధార్ అనుసంధానానికి మార్చి 31 చివరి తేదీ

పన్ను ఎగవేతను అరికట్టే విషయంలో ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పాన్ కార్డుకు చాలా ప్రాధాన్యముంది. ఐటీఆర్ దాఖలు చేయాలంటే ఆధార్, పాన్ అనుసంధానం తప్పనిసరి. దీనికి 2019 మార్చి 31 చివరి తేదీ. ఈలోపు పాన్ కార్డు కలిగిన వారు వారి పాన్ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. ఒకవేళ మీరు మీ ఆధార్, పాన్ కార్డును అనుసంధానం చేసుకోకపోతే మీ పాన్ కార్డు పనిచేయకపోవచ్చు.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏఏ ప్రకారం పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోతే మీ పాన్ కార్డు పనిచేయదు. ఆదాయపు పన్ను శాఖ త్వరలో ఈ-రిఫండ్స్‌ను జారీ చేయనుంది. రిఫండ్ నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు వచ్చి చేరుతుంది. పాన్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ అనుసంధానం చేసుకున్న వారికే ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటుంది.