రాజేంద్రనగర్‌లో మరోమారు చిరుత పులి కలకలం

హైదరాబాద్‌ శివారులో చిరుత సంచారం అటవీశాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాజేంద్రనగర్‌లో మరోమారు చిరుత పులి కలకలం రేపింది.

రాజేంద్రనగర్‌లో మరోమారు చిరుత పులి కలకలం
Balaraju Goud

|

Aug 26, 2020 | 1:19 PM

హైదరాబాద్‌ శివారులో చిరుత సంచారం అటవీశాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాజేంద్రనగర్‌లో మరోమారు చిరుత పులి కలకలం రేపింది. రాజేంద్రనగర్‌లో కొద్దిరోజుల క్రితం ఓ చిరుతపులి సంచరించి సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి చిరుతపులి హిమాయత్ సాగర్ వాలంటరీ రీసెర్చ్ ఫ్యూమ్ హౌస్ దగ్గర ఆవులపై దాడి చేసింది. ఒక ఆవు దూడను పట్టి చంపి తింటున్న దృశ్యాలు కలకలం రేపాయి. యజమాని తన ఆవులని కాపాడుకునేందుకు డప్పు శబ్ధం చేయడంతో చిరుతపులి పారిపోయింది. దీంతో పోలీసులకు పిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అటవీ అధికారుల సాయంతో చిరుత పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా మే నెలలో కాటేదాన్ ప్రాంతంలో చిరుత పులి నడిరోడ్డుపై కనిపించడం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. డివైడర్ వద్ద తిష్టవేసి స్థానికులకు భయభ్రాంతులకు గురిచేసింది.. అంతేకాకుండా ఓ లారీ డ్రైవర్‌పైనా దాడి చేసి పారిపోయింది. అనంతరం అదే పులి వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవరణలో సంచరించినట్లుగా అధికారులు గుర్తించారు. వర్సిటి ప్రాంగణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో చిరుత సంచారం రికార్డయ్యింది. అప్పటి నుంచి చిరుతను బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక, మరోసారి చిరుత కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu