శాసన రాజధాని అమరావతి: ప్రభుత్వ రాయితీలు ఇవే

ఏపీకి సంపూర్ణ రాజధానిగా వున్న అమరావతి త్వరలోనే శాసన రాజధానిగా మారబోతోంది. లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా మారనున్న అమరావతికి జరిగే నష్టాన్ని అదే స్థాయిలో పూడ్చేందుకు ప్రభుత్వం భారీ నజరానానే ప్రకటించింది. ముఖ్యంగా రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయాన్ని గణనీయంగా పెంచనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అమరావతిలో శాసనసభతోపాటు సంబంధిత అన్ని కార్యాలయాలు కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. అయితే, జీఎన్ రావు, బోస్టన్ గ్రూపు ప్రతిపాదించిన రాజ‌భవన్‌ను […]

శాసన రాజధాని అమరావతి: ప్రభుత్వ రాయితీలు ఇవే
Follow us

|

Updated on: Jan 20, 2020 | 4:09 PM

ఏపీకి సంపూర్ణ రాజధానిగా వున్న అమరావతి త్వరలోనే శాసన రాజధానిగా మారబోతోంది. లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా మారనున్న అమరావతికి జరిగే నష్టాన్ని అదే స్థాయిలో పూడ్చేందుకు ప్రభుత్వం భారీ నజరానానే ప్రకటించింది. ముఖ్యంగా రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయాన్ని గణనీయంగా పెంచనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

అమరావతిలో శాసనసభతోపాటు సంబంధిత అన్ని కార్యాలయాలు కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. అయితే, జీఎన్ రావు, బోస్టన్ గ్రూపు ప్రతిపాదించిన రాజ‌భవన్‌ను మాత్రం విశాఖకు తరలించారు. ముందుగా ప్రకటించినట్లుగా హైకోర్టు బెంచ్ కూడా అమరావతిలో ఏర్పాటు కావడం లేదు. అయితే, శాసనసభ భవనం, శాసనసభ సచివాలయం మాత్రం అమరావతిలో కొనసాగుతాయి.

అయితే రాజధాని కోసం ఇచ్చిన భూములను తిరిగి ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్న క్లారిటీ శాసనసభ ప్రత్యేక సమావేశాల తొలిరోజునే వచ్చేసింది. రాజధాని గ్రామాల ప్రజలకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మంత్రి బొత్స ప్రకటించారు. అయితే ప్రభుత్వ సాయం గత ప్రకటనల కంటే ఎక్కువ స్థాయిలో వుంటుందని ఆయన తెలిపారు. రాజధాని గ్రామాల్లో భూమిలేని నిరుపేదలకు ఇస్తున్న పెన్షన్‌ను 2500 నుంచి 5 వేల రూపాయలకుకు పెంచబోతున్నామని చెప్పారు. రాజధానికి భూములు ఇచ్చిన పట్టా రైతులతో సమానంగా అసైన్డ్‌ భూములు ఇచ్చిన అసైన్డ్‌ దారులకు కూడా రిటర్న్‌ ప్లాట్ల కేటాయిస్తామన్నారు.

భూములిచ్చిన రైతులకు గతంలో జరీబుకైతే యాభై వేలు రూపాయలు, మెట్టభూమికి అయితే 30 వేల రూపాయలు 10 ఏళ్ల పాటు చెల్లించాలన్నది అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించగా.. దాన్ని ఇపుడు జగన్ సర్కార్ 15 సంవత్సరాలకు పొడిగించారు. 10 ఏళ్ల తర్వాత జరీబు భూమికి ఇచ్చే యాన్యునిటీ ఒక లక్ష రూపాయిలు, మెట్టభూమికి 60 వేల రూపాయల అవుతుందని చెప్పారు మంత్రి బొత్స.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..