లెబనాన్ లో ఇక సైనిక పాలన, పార్లమెంట్ ఆమోదం

అమోనియం నైట్రేట్ జంట పేలుళ్లలో 170 మందికి పైగా మృతి, ఆరు వేల మందికి పైగా క్షతగాత్రులతో పెను బీభత్సాన్ని, రాజకీయ అనిశ్చితను ఎదుర్కొన్న లెబనాన్ లో ఇక మిలిటరీ పాలన..

లెబనాన్ లో ఇక సైనిక పాలన, పార్లమెంట్ ఆమోదం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 13, 2020 | 7:44 PM

అమోనియం నైట్రేట్ జంట పేలుళ్లలో 170 మందికి పైగా మృతి, ఆరు వేల మందికి పైగా క్షతగాత్రులతో పెను బీభత్సాన్ని, రాజకీయ అనిశ్చితను ఎదుర్కొన్న లెబనాన్ లో ఇక మిలిటరీ పాలన ఏర్పడనుంది. సైనిక పాలనతో బాటు  బీరూట్ లో ఎమర్జెన్సీని ప్రకటిస్తూ  పార్లమెంట్ గురువారం తీర్మానాన్ని ఆమోదించింది. అంటే ఇక బీరూట్ లోసర్వాధికారాలూ మిలిటరీకే ఉంటాయి. మీడియా వార్తలను సెన్సార్ చేయవచ్చు.. ప్రజా ఆందోళనలలో పాల్గొనేవారిని నిర్దాక్షిణ్యంగా మిలిటరీ కోర్టులకు పంపవచ్ఛు. ఎదురు తిరిగిన వారిపై ఎలాంటి చర్య తీసుకోవడానికైనా సైన్యానికే అధికారం ఉంటుంది.

అయితే మితవాద బృందాలు మాత్రం పార్లమెంట్ చర్యను తప్పు పడుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో పౌర ప్రభుత్వానికి ఇంకా అధికారాలు పెరిగాయని, ఈ నిరంకుశ సైనిక పాలనను వ్యతిరేకిస్తామని ఈ బృందాలు పేర్కొంటున్నాయి. ఇటీవలే లెబనాన్ ప్రధాని,  ఆయన ప్రభుత్వం రాజీనామా చేసి అధికారం నుంచి  వైదొలగినప్పటికీ ఈ మితవాదుల వాదన అర్థం కాకుండా ఉందనే అభిప్రాయాలు వినవస్తున్నాయి.