టీడీపీకి ఇంకొందరి ఝలక్.. అసలు జరుగుతున్నది ఇదే

రాజధాని ఆందోళనతో జనంలోకి చొచ్చుకుపోతున్న తెలుగుదేశం పార్టీకి సొంత నేతలే చెమటలు పుట్టిస్తున్నారు. అటు అసెంబ్లీలోను, ఇటు మండలిలోను పార్టీ సభ్యులు తీసుకుంటున్న యూ టర్న్‌లు… అధిష్టానానికి షాక్ పుట్టిస్తోంది. అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ స్టాండ్‌కు భిన్నంగా రాజధానుల బిల్లుకు మద్దతునివ్వగా.. ఇటు మండలిలోను ఇద్దరు ఎమ్మెల్సీలు డైరెక్ట్ ఝలక్ ఇచ్చారు. మరో ముగ్గురు ఇన్‌డైరెక్టుగా షాకిచ్చారు. శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని కలిగి వున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇందులో డొక్కా మాణిక్య […]

టీడీపీకి ఇంకొందరి ఝలక్.. అసలు జరుగుతున్నది ఇదే
Follow us

|

Updated on: Jan 22, 2020 | 1:16 PM

రాజధాని ఆందోళనతో జనంలోకి చొచ్చుకుపోతున్న తెలుగుదేశం పార్టీకి సొంత నేతలే చెమటలు పుట్టిస్తున్నారు. అటు అసెంబ్లీలోను, ఇటు మండలిలోను పార్టీ సభ్యులు తీసుకుంటున్న యూ టర్న్‌లు… అధిష్టానానికి షాక్ పుట్టిస్తోంది. అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ స్టాండ్‌కు భిన్నంగా రాజధానుల బిల్లుకు మద్దతునివ్వగా.. ఇటు మండలిలోను ఇద్దరు ఎమ్మెల్సీలు డైరెక్ట్ ఝలక్ ఇచ్చారు. మరో ముగ్గురు ఇన్‌డైరెక్టుగా షాకిచ్చారు.

శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని కలిగి వున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇందులో డొక్కా మాణిక్య వరప్రసాద్.. బిల్లు సభకు రాకముందే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శమంతకమణి, శత్రుచర్ల విజయరామరాజు మండలి భేటీకి దూరంగా వున్నారు. సభకు హాజరైన శివానందరెడ్డి, పోతుల సునీత మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లుకు అనుకూలంగా, టీడీపీ విధానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.

ఒక అంశంలో ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలోను, అయిదుగురు ఎమ్మెల్సీలు మండలిలోను పార్టీకి ఝలక్ ఇచ్చారు. అసలు టీడీపీలో ఏం జరుగుతోంది? ఈ డెవలప్‌మెంటు వెనుక వైసీపీ అధినాయకత్వం వ్యూహం వుందా? ఇదిప్పుడు అమరావతిలో పెద్ద చర్చకు తెరలేపింది. పార్టీ స్టాండ్‌కు భిన్నంగా ఓటేసిన ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్య తీసుకోవాలంటూ టీడీపీ మండలి పక్షం ఛైర్మెన్ షరీఫ్‌కు ఫిర్యాదు చేసింది. తద్వారా వారిని టీడీపీ స్వయంగా వైసీపీ వైపు నెట్టినట్లయింది.

మూడు రాజధానుల అంశంపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు లేవని ఆ పార్టీ చెబుతున్నా ఈ పరిణామాలు పార్టీ వాదనలో పస లేదని చాటుతున్నాయి. వైసీపీ ఆకర్షిస్తోందో.. లేక టీడీపీ వదిలేసుకుంటోందో.. కానీ.. ఎమ్మెల్సీల్లో మరికొందరు కూడా వైసీపీ బాట పట్టనున్నారని తెలుస్తోంది. అసలు టీడీపీలో ఏం జరుగుతోందన్నదిపుడు పెద్ద ప్రశ్నగా మారుతోంది.

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..