ఇకపై ‘ఫోన్ పే’ నుంచి డబ్బు విత్ డ్రా.. ఎలాగంటే.?

డిజిటల్ లావాదేవీల యాప్స్ లిస్ట్‌లో ‘ఫోన్ పే’ అగ్రస్థానంలో ఉంటుంది. నగదు బదిలీ, రీఛార్జ్, టికెట్ బుకింగ్, చెల్లింపులు ఇలా రకరకాల ఫీచర్లతో పాటుగా అదిరిపోయే క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. అందుకే దుకాణాలు, నగదు చెల్లింపులోనూ ఈ యాప్‌నే జనాలు ఎక్కువగా వాడుతుంటారు. ఈ నేపథ్యంలో ‘ఫోన్ పే’ సంస్థ తన వినియోగదారుల కోసం సరికొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఈ మధ్యకాలంలో బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు ఉన్నా.. వాటిని ఏటీఎం నుంచి విత్ […]

ఇకపై 'ఫోన్ పే' నుంచి డబ్బు విత్ డ్రా.. ఎలాగంటే.?
Follow us

|

Updated on: Jan 24, 2020 | 2:17 PM

డిజిటల్ లావాదేవీల యాప్స్ లిస్ట్‌లో ‘ఫోన్ పే’ అగ్రస్థానంలో ఉంటుంది. నగదు బదిలీ, రీఛార్జ్, టికెట్ బుకింగ్, చెల్లింపులు ఇలా రకరకాల ఫీచర్లతో పాటుగా అదిరిపోయే క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. అందుకే దుకాణాలు, నగదు చెల్లింపులోనూ ఈ యాప్‌నే జనాలు ఎక్కువగా వాడుతుంటారు. ఈ నేపథ్యంలో ‘ఫోన్ పే’ సంస్థ తన వినియోగదారుల కోసం సరికొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.

ఈ మధ్యకాలంలో బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు ఉన్నా.. వాటిని ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక ఇప్పుడు ఆ సమస్యల నుంచి కస్టమర్లకు ఉపశమనం కల్పించాలని ‘ఫోన్ పే’ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు ఆన్లైన్ నగదు చెల్లింపులు మాత్రమే ఉండగా.. ఇకపై నగదు ఉపసంహరణ సౌకర్యాన్ని కూడా కల్పించనుంది.

‘ఫోన్ పే ఏటీఎం’ పేరుతో అందుబాటులోకి రానున్న ఈ సదుపాయం ద్వారా డబ్బును యాప్ ద్వారానే విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే దీని నుంచి కేవలం రూ.1000 మాత్రమే పొందే అవకాశం ఉంది. ‘ఫోన్ పే’ యాప్‌ ఓపెన్ చేసి స్టోర్స్‌లోకి వెళ్తే అక్కడ ‘ఫోన్ పే ఏటీఎం’ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక దాన్ని క్లిక్ చేస్తే దగ్గరలో ఫోన్ పే సదుపాయం ఉన్న షాపులు కనిపిస్తాయి. ఇక ఆ దుకాణదారుడి దగ్గర నుంచి డబ్బు తీసుకునేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది. అటు ఏ వ్యాపారి అయినా ‘ఫోన్ పే ఏటీఎం’కు దరఖాస్తు చేసుకోవచ్చునని.. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని సంస్థ వెల్లడించింది.