రాత్రిపూట చిరుతిళ్లు తింటున్నారా.. మీ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లే.!

Latest Health Tips: కొంతమందికి అర్ధరాత్రి వేళ నిద్రపట్టక తెగ ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు రాత్రంతా టీవీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఏదొకటి తింటూ గడిపేస్తారు. అయితే అలా మెలుకువగా ఉండటం.. అంతేకాక పొటాటో చిప్స్, చేగోడీల లాంటి చిరుతిళ్ళు తినడం ప్రాణానికి ప్రమాదం తెచ్చిపెడుతుందని వైద్యులు అంటున్నారు. రాత్రివేళ ఎక్కువసేపు మెలుకువగా ఉంటూ స్నాక్స్ లాంటివి ఎక్కువగా తినేవారికి హృద్రోగాలు, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మెక్సికో వర్సిటీలో దీనిపై పరిశోధనలు జరపగా.. […]

రాత్రిపూట చిరుతిళ్లు తింటున్నారా.. మీ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లే.!

Latest Health Tips: కొంతమందికి అర్ధరాత్రి వేళ నిద్రపట్టక తెగ ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు రాత్రంతా టీవీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఏదొకటి తింటూ గడిపేస్తారు. అయితే అలా మెలుకువగా ఉండటం.. అంతేకాక పొటాటో చిప్స్, చేగోడీల లాంటి చిరుతిళ్ళు తినడం ప్రాణానికి ప్రమాదం తెచ్చిపెడుతుందని వైద్యులు అంటున్నారు.

రాత్రివేళ ఎక్కువసేపు మెలుకువగా ఉంటూ స్నాక్స్ లాంటివి ఎక్కువగా తినేవారికి హృద్రోగాలు, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మెక్సికో వర్సిటీలో దీనిపై పరిశోధనలు జరపగా.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది.

ఈ పరిశోధనలో వారు కొన్ని ఎలుకలకు.. అవి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కొవ్వు అధికంగా ఉండే పదార్ధాలను పెట్టారు. దానితో వాటి రక్తంలో కొవ్వు స్థాయి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక ఇదే పరిశోధనను పగటి వేళ ప్రయత్నించగా.. ప్రభావం అంతగా లేదని పరిశోధకులు అంటున్నారు. అందుకే రాత్రిపూట ఎక్కువసేపు మెలుకువగా ఉండకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

Published On - 9:41 pm, Mon, 3 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu