‘జాను’ మూవీ ప్రాణం తీసిందా..?

Latest Crime News: హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక గోకుల్ థియేటర్‌లో ఒక గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆ రోజు విడుదలైన ‘జాను’ సినిమా చూడటానికి ఓ వ్యక్తి మ్యాట్నీ షో‌కు గోకుల్ థియేటర్‌కు వచ్చాడు. సినిమా పూర్తయిన తర్వాత అందరూ వెళ్లిపోతున్నా.. ఆ వ్యక్తి కదలకపోవడంతో నిద్రపోయాడేమోనని థియేటర్ సిబ్బంది అతడ్ని లేపడానికి ప్రయత్నించారు. ఎక్కడా కూడా ఉలుకు.. […]

  • Ravi Kiran
  • Publish Date - 1:43 pm, Sat, 8 February 20
'జాను' మూవీ ప్రాణం తీసిందా..?

Latest Crime News: హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక గోకుల్ థియేటర్‌లో ఒక గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆ రోజు విడుదలైన ‘జాను’ సినిమా చూడటానికి ఓ వ్యక్తి మ్యాట్నీ షో‌కు గోకుల్ థియేటర్‌కు వచ్చాడు. సినిమా పూర్తయిన తర్వాత అందరూ వెళ్లిపోతున్నా.. ఆ వ్యక్తి కదలకపోవడంతో నిద్రపోయాడేమోనని థియేటర్ సిబ్బంది అతడ్ని లేపడానికి ప్రయత్నించారు. ఎక్కడా కూడా ఉలుకు.. పలుకు లేకపోవడంతో అతడు సీటులోనే మృతి చెందినట్లు గుర్తించారు.

దీంతో థియేటర్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అతడి పాకెట్‌లో ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి.. గుండెపోటుతో మరణించాడా.. లేక వేరేదైనా కారణాలు ఉన్నాయా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.