గుడ్ న్యూస్…భారీగా ప‌డిపోయిన బంగారం ధ‌ర‌లు…

పసిడి ధర మళ్లీ తగ్గింది. గత కొన్ని రోజులుగా వ‌ర‌స‌గా పెరుగుతూ వచ్చిన బంగారం ధ‌ర రెండు రోజులుగా తగ్గుతూనే ఉంది. దీంతో ఇప్పుడు బంగారం కొనాల‌నుకునేవారికి ఇది శుభ‌వార్తే. ఇంటర్నేష‌న‌ల్ మార్కెట్‌లో ప‌సిడి ధర తగ్గడంతో మన దేశంలోనూ బంగారంపై ప్రతికూల ప్రభావం పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక వెండి ధ‌ర‌లోనూ త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.215 తగ్గుడంతో రూ.43,170కు క్షీణించింది. […]

గుడ్ న్యూస్...భారీగా ప‌డిపోయిన బంగారం ధ‌ర‌లు...
Follow us

|

Updated on: Mar 31, 2020 | 6:47 AM

పసిడి ధర మళ్లీ తగ్గింది. గత కొన్ని రోజులుగా వ‌ర‌స‌గా పెరుగుతూ వచ్చిన బంగారం ధ‌ర రెండు రోజులుగా తగ్గుతూనే ఉంది. దీంతో ఇప్పుడు బంగారం కొనాల‌నుకునేవారికి ఇది శుభ‌వార్తే. ఇంటర్నేష‌న‌ల్ మార్కెట్‌లో ప‌సిడి ధర తగ్గడంతో మన దేశంలోనూ బంగారంపై ప్రతికూల ప్రభావం పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక వెండి ధ‌ర‌లోనూ త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది.

హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.215 తగ్గుడంతో రూ.43,170కు క్షీణించింది. అదే క్ర‌మంలో 22 క్యారెట్ల ప‌సిడి ధర కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ.320 తగ్గుదలతో రూ.39,520కు ప‌డిపోయింది. బంగారంతో పాటు వెండి ధ‌ర‌లు కూడా త‌గ్గుముఖం ప‌ట్టాయి. రూ.10 త‌గ్గ‌ద‌ల‌తో కేజీ వెండి రూ 9,500కు ప‌డిపోయింది.

ఇక ఇంటర్నేష‌న‌ల్ మార్కెట్‌లో కూడా ప‌సిడి ధ‌ర‌లో త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం 1639 డాలర్స్ వద్ద క‌ద‌లాడుతుంది. బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం తగ్గడంతో 1640.35 డాలర్స్ కు ప‌డిపోయింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో కూడా వెండి, బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధర రూ.400 తగ్గడంతో రూ.41,020కు ప‌డిపోయింది. అదే క్ర‌మంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధర కూడా రూ.420 త‌గ్గుద‌ల‌తో రూ.43,300కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర రూ.10 తగ్గడంతో రూ.39,500కు ప‌డిపోయింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధ‌ర‌ల‌పై ప్ర‌భావం చూపుతాయి.