డిగ్రీ విద్యార్థులకు అలెర్ట్.. దోస్త్‌ స్పెష‌ల్‌‌డ్రై‌వ్‌లో సీట్లు పొందిన విద్యార్థులకు రిపోర్టింగ్ చేసేందుకు నేడే ఆఖరు

డిగ్రీ కాలే‌జీల్లో సీట్ల భర్తీ‌కోసం నిర్వహించిన దోస్త్‌ స్పెష‌ల్‌‌డ్రై‌వ్‌లో సీట్లు పొందిన విద్యా‌ర్థు‌లకు రిపో‌ర్టింగ్‌ గడువు తేదీని బుధ‌వా‌రం‌ వ‌రకు పొడి‌గించారు.

డిగ్రీ విద్యార్థులకు అలెర్ట్..  దోస్త్‌ స్పెష‌ల్‌‌డ్రై‌వ్‌లో సీట్లు పొందిన విద్యార్థులకు రిపోర్టింగ్ చేసేందుకు నేడే ఆఖరు
Follow us

|

Updated on: Dec 09, 2020 | 8:18 AM

DOST last date extended: డిగ్రీ కాలే‌జీల్లో సీట్ల భర్తీ‌కోసం నిర్వహించిన దోస్త్‌ స్పెష‌ల్‌‌డ్రై‌వ్‌లో సీట్లు పొందిన విద్యా‌ర్థు‌లకు రిపో‌ర్టింగ్‌ గడువు తేదీని బుధ‌వా‌రం‌ వ‌రకు పొడి‌గించారు. ఈ మేరకు కన్వీ‌నర్‌ ప్రొఫె‌సర్‌ లింబాద్రి ఒక ప్రకటన చేశారు. దోస్త్ ద్వారా డిగ్రీలో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌, కేటాయించిన కాలేజీల‌లో రిపోర్టింగ్ చేయ‌డం, ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు స‌మ‌ర్పించ‌డానికి డిసెంబ‌ర్ 9వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీచేసింది. మంగ‌ళ‌వారం భార‌త్‌‌బంద్‌ నేప‌థ్యంలో చాలా‌మంది విద్యా‌ర్థులు కాలే‌జీల్లో రిపో‌ర్టింగ్‌ చేసుకోలేకపోయారు. విద్యా‌ర్థుల విజ్ఞప్తి మేరకు గడువు పెంచారు. సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో సీసీఓటీపీ, తాత్కాలిక కేటాయింపు లేఖ, ఇతర అవసరమైన ప్రతాలను తీసుకెళ్లి రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

దోస్త్‌ను మొత్తం 5 విడతలలో కౌన్సిలింగ్‌ నిర్వహించగా.. 1,58,067 సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో మొత్తం 986 డిగ్రీ కాలేజీలుండగా ఇందులో 4,09,450 సీట్లున్నాయి. మొదటి రెండు విడతల్లో 1,44,886, మూడో విడతలో 57,695, ప్రత్యేక విడతలో 21,437 సీట్లు భర్తీ అయ్యాయి. చివరి విడతలో 27,365 మందికి సీట్లు ఖరారు చేశారు. దోస్త్ స్పెష‌ల్ డ్రైవ్ ద్వారా 14,247 మంది అభ్యర్థులు ప్రవేశం పొందారు. అంత‌కు క్రితం చేప‌ట్టిన ద‌శ‌ల్లో మొత్తం 28,136 మంది అభ్యర్థులు ఆప్షన్లు ఇవ్వగా వీరిలో 27,365 మందికి సీట్లు కేటాయించారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు