ఐదేళ్ల పాటు ఆమోదం పొందకపోతే.. అంతే : వెంకయ్య నాయుడు

రాజ్యసభలో ఏదైన బిల్లు ఐదేళ్లపాటు ఆమోదం పొందకపోతే అది మురిగి పోయినట్టేనన్నారు రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు. రాజ్యసభలో 33 బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. 20 ఏళ్లలో మూడు బిల్లులు ఆమోదం పొందలేదని తెలిపారు. భారత వైద్యమండలి సవరణ బిల్లు 32 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందన్నారు. చాలా కాలంపాటు బిల్లులు ఆమోదం పొందకుండా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అన్నారు. మరో ఆరు బిల్లులు 10 నుంచి 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మరో 14 […]

ఐదేళ్ల పాటు ఆమోదం పొందకపోతే.. అంతే : వెంకయ్య నాయుడు
Follow us

| Edited By:

Updated on: Jun 22, 2019 | 11:44 AM

రాజ్యసభలో ఏదైన బిల్లు ఐదేళ్లపాటు ఆమోదం పొందకపోతే అది మురిగి పోయినట్టేనన్నారు రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు. రాజ్యసభలో 33 బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. 20 ఏళ్లలో మూడు బిల్లులు ఆమోదం పొందలేదని తెలిపారు. భారత వైద్యమండలి సవరణ బిల్లు 32 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందన్నారు. చాలా కాలంపాటు బిల్లులు ఆమోదం పొందకుండా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అన్నారు. మరో ఆరు బిల్లులు 10 నుంచి 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మరో 14 బిల్లులు.. 5 నుంచి 10 ఏళ్లుగా ఆమోదానికి ఎదురు చూస్తున్నాయని గుర్తు చేశారు.