Telangana news: నేటి నుంచి ప్రారంభం కానున్న సాగర్‌- శ్రీశైలం లాంచీ ప్రయాణం.. ఛార్జీల వివరాలివే..

కృష్ణమ్మ పరవళ్లలో ప్రయాణిస్తూ నల్లమల అటవీ అందాలను వీక్షించాలనుకుంటున్న వారికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ శుభవార్త చెప్పింది

Telangana news: నేటి నుంచి ప్రారంభం కానున్న సాగర్‌- శ్రీశైలం  లాంచీ ప్రయాణం.. ఛార్జీల వివరాలివే..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2021 | 6:00 PM

కృష్ణమ్మ పరవళ్లలో ప్రయాణిస్తూ నల్లమల అటవీ అందాలను వీక్షించాలనుకుంటున్న వారికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ శుభవార్త చెప్పింది. సోమవారం (నవంబర్‌ 29) నుంచి నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం సాగర్‌ నీటిమట్టం 588.80 అడుగులు ఉన్నందుకు ఈ యాత్రకు అనుమతిస్తున్నట్లు పర్యటక సంస్థ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు నాగార్జున సాగర్‌ నుంచి లాంచీ బయలుదేరుతుంది. సాయంత్రం 3 గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది. మళ్లీ మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి లాంచీ బయలుదేరి సాయంత్రం 3 గంటలకు నాగార్జున సాగర్‌ చేరుకుంటుంది. కాగా ఈ ఆహ్లాదకర ప్రయాణానికి ఆదివారం సాయంత్రం వరకు 60 టికెట్లు బుక్‌ అయినట్లు అధికారులు వెల్లడించారు.

టూర్‌ ఛార్జీల వివరాలివే.. సాగర్‌ నుంచి శ్రీశైలానికి ఒకవైపు పెద్దలకు రూ.1,500. పిల్లలకు రూ.1,200. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌ వైపు కూడా ఇదే ఛార్జీ వసూలు చేస్తారు. రెండు వైపులా ప్రయాణమైతే పెద్దలకు రూ. 2,500, పిల్లలకు – రూ.2,000 ఛార్జీ తీసుకుంటారు. ఇక హైదరాబాద్‌ నుంచి బస్‌ ప్యాకేజీతో కలిపి పెద్దలకు రూ.3,999, పిల్లలకు రూ.3,399 వసూలు చేయనున్నారు.

Also Read:

Telangana: బార్‌లో యాక్షన్ హీరో.. డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీల్లో ‘స్వాతిముత్యం’లో కమల్ హాసన్

Tomato price today: ఊరించి, ఉసూరుమనిపించి.. తుస్సుమన్న టమాట ధర.. కేజీ 30 రూపాయలే..

CM KCR: కేంద్రం అసంబద్ధ విధానంపై పోరాడుదాం.. జాతీయ ఆహార సమగ్ర విధానాన్ని ప్రకటిచాలిః సీఎం కేసీఆర్