13 తరువాత కూడా రెమ్యునరేషన్‌లో వెనక్కి తగ్గని భారతి!

ఏకంగా 13 ఏళ్ల విరామం తర్వాత లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి ముఖానికి మేకప్ వేశారు. ఆమె రీఎంట్రీ ఇస్తున్నారనగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికీ ఆమెలో పవర్, మొఖంలో గాంభీర్యం ఏ మాత్రం తగ్గలేదని.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మళ్లీ ప్రూవ్ చేసుకున్నారు. విజయ్ శాంతి రీ ఎంట్రీకి తగ్గట్టుగానే ఈ సినిమా మంచి బజ్‌ని క్రియేట్ చేసింది.  ఈ నెల 11వ వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆమె పవర్ ఫుల్ భారతి పాత్రలో […]

13 తరువాత కూడా రెమ్యునరేషన్‌లో వెనక్కి తగ్గని భారతి!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 17, 2020 | 7:11 PM

ఏకంగా 13 ఏళ్ల విరామం తర్వాత లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి ముఖానికి మేకప్ వేశారు. ఆమె రీఎంట్రీ ఇస్తున్నారనగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికీ ఆమెలో పవర్, మొఖంలో గాంభీర్యం ఏ మాత్రం తగ్గలేదని.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మళ్లీ ప్రూవ్ చేసుకున్నారు. విజయ్ శాంతి రీ ఎంట్రీకి తగ్గట్టుగానే ఈ సినిమా మంచి బజ్‌ని క్రియేట్ చేసింది.  ఈ నెల 11వ వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆమె పవర్ ఫుల్ భారతి పాత్రలో నటించి మెప్పించారు. అన్యాయం జరిగితే వెనక్కి తగ్గకుండా వీరోచితంగా పోరాడిన మహిళ పాత్రలో ఒదిగిపోయారు.

ఇదంతా బాగానే ఉన్నా.. విజయశాంతి రీ ఎంట్రీకి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారనేది ప్రస్తుతం క్యూరియస్‌గా ఉంది. గతంలోనే ఆమె భారీగా పారితోషికం తీసుకునేవారట. ఇప్పుడు ఏకంగా.. హీరోయిన్ రష్మిక మందన్నా కంటే రెండు రెట్లు పారితోషికం అందుకున్నారని సమాచారం. ఇప్పుడు ఇదే విషయంపై టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. జీఎస్టీతో కలిసి దాదాపు రూ.1.5 కోట్లు తీసుకున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలీదు కానీ.. ఆమె పారితోషికం విషయంలో మాత్రం ఇప్పటికే ఫుల్ గాసిప్స్ వస్తున్నాయి.

కాగా.. ఇకపై విజయశాంతి నటనలో కొనసాగునని తెలిపారు. అయితే పవర్‌ ఫుల్ రోల్స్‌ మాత్రమే చేస్తానని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఆమెనే తెలిపారు.