నకిలీ కరోనా రిపోర్ట్.. ఓ బ్యాంక్ మేనేజర్ మ‌ృతి

Lab hands over fake negative COVID-19  :  కరోనాను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు.. తప్పుడు పత్రాలతో మాయ చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. కొవిడ్-19 పరీక్షల పేరుతో అడ్డంగా దోపిడీకి తెరలేపుతున్నారు. ఇలాంటి దందాలతో సామాన్య జనంను కాటికి పంపుతున్నారు. ఇలాంటి దుర్మార్గులు తప్పుడు కరోనా పరీక్షలు చేసి పాజిటివ్ ఉంటే.. నెగటీవ్.. అని నెగటీవ్ రిపోర్ట్ వస్తే దాన్ని కరోనా ఉందంటూ భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనే బెంగల్ రాజధాని కొల్ కతాలో ఈ దారుణం […]

నకిలీ కరోనా రిపోర్ట్.. ఓ బ్యాంక్ మేనేజర్ మ‌ృతి

Lab hands over fake negative COVID-19  :  కరోనాను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు.. తప్పుడు పత్రాలతో మాయ చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. కొవిడ్-19 పరీక్షల పేరుతో అడ్డంగా దోపిడీకి తెరలేపుతున్నారు. ఇలాంటి దందాలతో సామాన్య జనంను కాటికి పంపుతున్నారు. ఇలాంటి దుర్మార్గులు తప్పుడు కరోనా పరీక్షలు చేసి పాజిటివ్ ఉంటే.. నెగటీవ్.. అని నెగటీవ్ రిపోర్ట్ వస్తే దాన్ని కరోనా ఉందంటూ భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనే బెంగల్ రాజధాని కొల్ కతాలో ఈ దారుణం జరిగింది. డబ్బుల కోసం ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు చేసిన మోసానికి ఓ బ్యాంక్ మేనేజర్ ప్రాణాలు కోల్పోయారు.

ఆయన భార్య ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొల్ కతాలోని ఓ బ్యాంక్ మేనేజర్ గత కొద్ది రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నాడు. దీంతో అనుమానించిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ డాక్టర్‌ను సంప్రదించారు. ఆ డాక్టర్ కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించారు. అంతే కాదు ల్యాబ్ టెక్నీషియన్‌కు సంబంధించిన వివరాలను డాక్టర్ వారికి ఇచ్చారు. అయితే మేనేజర్ కదలలేనిస్థితిలో ఉండటంతో.. ల్యాబ్ టెక్నీషియనే ఇంటికి వచ్చి శాంపిల్ సేకరించాడు. ఆ తరువాత.. మేనేజర్‌కు కరోనా లేదంటూ ఫోన్‌లో సమాచారం అందించాడు.

వాట్సాప్ ద్వారా కూడా మెస్సెజ్ పంపించడమే కాకుండా.. హార్డ్ కాపీని కూడా కుటుంబసభ్యులకు అందించాడు. అయితే ఇటీవల మేనేజర్ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎమ్ఆర్ బంగూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు కరోనా రిపోర్టును పరిశీలించి అది నకిలీదని తేల్చి చెప్పారు.

రిపోర్టుపై ఉన్న పేషెంట్ ఐడీలో తొమ్మిది అంకెలు మాత్రమే ఉన్నాయని, సాధారణంగా కరోనా రిపోర్ట్‌లో 11 అంకెలు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా.. చేతితో ఈ అంకెలు రాయడాన్ని కూడా వారు ఎత్తి చూపారు. అయితే గురువారం నాడు ఆరోగ్యం పరిస్థితి విషమించి మేనేజర్ మృతి చెందారు. దీంతో మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరోనా సోకిందని ముందుగా తెలిసుంటే భర్తను కాపాడుకోగలిగి ఉండేదాన్నని, నకిలీ రిపోర్టు కారణంగా కాలయాపన జరిగిని భర్త చనిపోయాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu