పెన్నీ ఫార్మింగ్‌లో గిన్నిస్ రికార్డ్ సాధించిన కేరళవాసి.. ఏకంగా సముద్ర ఉపరితలానికి పదకొండు వందల మీటర్ల..

కేరళలోని తిరువనంతపురంనకు చెందిన పీకె కుమార్ పెన్నీ ఫార్మింగ్‌లో గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు. ముందు చక్రం చాలా పెద్దదిగా

  • Publish Date - 9:46 am, Mon, 28 December 20
పెన్నీ ఫార్మింగ్‌లో గిన్నిస్ రికార్డ్ సాధించిన కేరళవాసి.. ఏకంగా సముద్ర ఉపరితలానికి పదకొండు వందల మీటర్ల..

కేరళలోని తిరువనంతపురంనకు చెందిన పీకె కుమార్ పెన్నీ ఫార్మింగ్‌లో గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు. ముందు చక్రం చాలా పెద్దదిగా ఉండి, వెనక చక్రం చాలా చిన్నదిగా ఉండే సైకిల్‌నే పెన్నీ ఫార్మింగ్‌ అంటారు. అప్పుడప్పుడు వీటిని మనం సర్కస్‌లలో చూస్తాం. అయితే సైకిల్‌కు మొదటి రూపం కూడా ఇదే. దీనిని నడపడం అంత సులువు కాదు. అలాంటిది దానిని నడపడం ప్రాక్టీస్ చేసిన కుమార్ ఏకంగా గిన్నిస్ రికార్డ్ సాధించారు.

2019లో ప్రారంభమైన ఆయన పెన్నీ ఫార్మింగ్‌ రైడింగ్ ప్రస్తుతం రికార్డుల దిశగా సాగుతోంది. సముద్ర మట్టానికి 1100ల మీటర్ల ఎత్తులో ఉన్న కేరళలోని పొన్‌ముడి హిల్ నుంచి కిందకు దిగుతూ హై వీలర్ రైడింగ్ ప్రాక్టీస్ చేశారు. అలా కొండ నుంచి కింది వరకు మొత్తంగా12.7 కిలో మీటర్ల దూరాన్ని కేవలం గంట 13 నిమిషాల్లో దిగి ఇటీవల గిన్నిస్ బుక్ ఆప్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. కుమార్ ఒక నిమిషంలో 226 క్లాక్ వైస్, యంటి క్లాక్ వైస్ హ్యాండ్ రొటేషన్ చేసి గతంలోనే ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం 21.3 కిలో మీటర్లు బ్యాక్ వర్డ్ బ్రెయిన్ సైకిల్ నడిపి మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. కుమార్ ఒక్కడే కాదు ఆయన భార్య, కూతుర్లు కూడా హ్యాండ్ రొటేషన్స్‌లో ప్రపంచ రికార్డ్స్ సాధించారు.