కుల్ భూషణ్ ను కలిసిన భారత దౌత్యాధికారులు..ఏం చెప్పారంటే..?

పాకిస్తాన్ లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ కుయుక్తులు మరోసారి బయటపడ్డాయి. అక్కడి ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షను.. స‌వాల్ చేసేందుకు కుల్ భూషణ్ నిరాకరించారంటూ పాక్ చేసిన ప్రచారం బూట‌క‌మ‌ని తేలింది.

కుల్ భూషణ్ ను కలిసిన భారత దౌత్యాధికారులు..ఏం చెప్పారంటే..?
Follow us

|

Updated on: Jul 17, 2020 | 3:26 PM

పాకిస్తాన్ లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ కుయుక్తులు మరోసారి బయటపడ్డాయి. అక్కడి ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షను.. స‌వాల్ చేసేందుకు కుల్ భూషణ్ నిరాకరించారంటూ పాక్ చేసిన ప్రచారం బూట‌క‌మ‌ని తేలింది. ఎట్ట‌కేల‌కు గురువారం భారత లాయర్లు పాక్ జైలులో జాదవ్ ను కలిశారు. కానీ తనతో ప్ర‌శాంతంగా మాట్లాడనీయకుండా అడుగడుగునా ఇబ్బందులు సృష్టించారు పాక్ అధికారులు. జాదవ్ తో భార‌త అధికారులు మాట్లాడుతున్న‌ప్పుడు సైతం వారు ప‌క్కనే ఉన్నారు. ఈ మేర‌కు  జాదవ్ ను కలిసిన లాయర్ల టీమ్ నుంచి ఈ మేరకు రిపోర్టు వచ్చింద‌ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. జాదవ్ న్యాయసహాయాన్ని నిరాకరించాడంటూ పాకిస్తాన్ ప్రచారం చేసిన మాట అవాస్తవమని తేట‌తెల్ల‌మైంది. అయితే, మరణ శిక్షపై రివ్యూ పిటిషన్ వేసేందుకు అవసరమైన సంతకాలు కూడా పెట్ట నీయకుండా పాకిస్థాన్ అధికారులు ఇబ్బందిక‌రంగా వ్య‌వ‌హ‌రించార‌ని శ్రీవాస్తవ చెప్పారు. వారి ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల జాద‌వ్ ఒత్తిడిలో ఉన్నాడ‌ని అధికారులు వివ‌రించారు. మ‌రోవైపు జాదవ్ మరణ శిక్ష రివ్యూకు ఈనెల 20 తో గడువు ముగియనుంది.

న్యాయసహాయం విష‌యంలో అంతర్జాతీయ కోర్టు ఆదేశించడంతో పాక్ అధికారుల‌ను క‌లిసేందుకైనా అనుమ‌తిచ్చింది. గతేడాది సెప్టెంబర్ లో మొదటిసారి దౌత్యాధికారుల‌ను కలిసే అవకాశమిచ్చిన దాయాది దేశం.. మళ్లీ ఇన్ని నెలలల తర్వాతగానీ రెండోసారి స‌మావేశానికి అనుమతించలేదు. జైలులో జాదవ్ తో మాట్లాడిన లాయర్ల టీమ్ తెలిపిన వివ‌రాల్నిబ‌ట్టి.. రివ్యూ పిటిషన్ వేయకుండా ఆపేందుకు అక్కడి అధికారులు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గడువులోగా పిటిషన్ పేపర్లపై కుల్ భూషణ్ సంతకాలు చేసేందుకు పాక్ ప‌ర్మిష‌న్ ఇవ్వ‌ని నేప‌థ్యంలో భారత్ మరోసారి అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించే అవకాశముంది.