“రెండేళ్లలో సిరిసిల్లకు రైలు”

మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జోరు చూపిస్తున్నారు. క్యాంపెయిన్‌లో కేవలం సిరిసిల్లకు పరిమితమమవుతానని చెప్పిన ఆయన..తాజాగా తన నియోజకవర్గానికి గుడ్ న్యూస్ చెప్పారు.  సిరిసిల్లను అన్ని రంగాల్లో డెవలప్ చేస్తామన్న మంత్రి..వచ్చే రెండు సంత్సరాలలో రైలు తీసుకురావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్ షో నిర్వహించారు. చేనేత విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదగా గాంధీ విగ్రహం వరకు సాగిన రోడ్​ షోకు భారీగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు […]

  • Ram Naramaneni
  • Publish Date - 10:05 pm, Sat, 18 January 20
"రెండేళ్లలో సిరిసిల్లకు రైలు"

మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జోరు చూపిస్తున్నారు. క్యాంపెయిన్‌లో కేవలం సిరిసిల్లకు పరిమితమమవుతానని చెప్పిన ఆయన..తాజాగా తన నియోజకవర్గానికి గుడ్ న్యూస్ చెప్పారు.  సిరిసిల్లను అన్ని రంగాల్లో డెవలప్ చేస్తామన్న మంత్రి..వచ్చే రెండు సంత్సరాలలో రైలు తీసుకురావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్ షో నిర్వహించారు. చేనేత విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదగా గాంధీ విగ్రహం వరకు సాగిన రోడ్​ షోకు భారీగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. టీఆర్‌ఎస్‌తోనే ప్రజల పార్టీ అన్న కేటీఆర్, మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.