కుండపోత వర్షంలోనూ విధులే ముఖ్యం, ఈ పోలీసన్నకు సెల్యూట్

పోలీస్..మనకు ఏ కష్టం వచ్చినా వినిపించే పేరు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ పోలీస్ మాత్రం విధి నిర్వహణలో వెెనకడుగు వెయ్యడు. వృత్తి ధర్మాన్ని విస్మరించడు.

కుండపోత వర్షంలోనూ విధులే ముఖ్యం, ఈ పోలీసన్నకు సెల్యూట్
Follow us

|

Updated on: Sep 26, 2020 | 4:57 PM

పోలీస్..మనకు ఏ కష్టం వచ్చినా వినిపించే పేరు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ పోలీస్ మాత్రం విధి నిర్వహణలో వెెనకడుగు వెయ్యడు. వృత్తి ధర్మాన్ని విస్మరించడు. తాజాగా కృష్ణా జిల్లా  హనుమాన్ జంక్షన్ లో ఓ పోలీస్ కానిస్టేబుల్ అందుకు సాక్ష్యంగా నిలిచాడు. హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఎప్పుడు ట్రాఫిక్ తో కిక్కిరిసి ఉంటుంది. అక్కడ డ్యూటీ చేసే పోలీసులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోతుంది. ఈ సర్కిల్ వద్ద కానిస్టేబుల్ దేవిశెట్టి శ్రీనివాస్ సెప్టెంబర్ 25 సాయంత్రం విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం విరుచుకుపడింది. వర్షం పడితే ట్రాఫిక్ ఎలా ఉంటుందో మళ్లీ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో జోరు వానలో తడుస్తూనే, వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఎంతో నిబద్ధతతో కానిస్టేబుల్ శ్రీనివాస్ డ్యూటీ చేశారు.

కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా డ్యూటీలో నిమగ్నమై కానిస్టేబుల్ శ్రీనివాస్ చూపిన వృత్తి ధర్మానికి.. రాష్ట్ర హోం మాంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో శనివారం జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు జిల్లా పోలీసు కార్యాలయంలో సదరు కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించి, తను చేసిన సేవకు ప్రోత్సాహకంగా నగదు రివార్డును అందజేసి అభినందించారు.

Also Read :

వివేకా హత్య కేసు అప్డేట్ : ఆర్థిక లావాదేవీల కోణంలో సీబీఐ ఫోకస్

కృష్ణా జిల్లాలో యాక్సిడెంట్, తండ్రీకూతుళ్లను బలితీసుకున్న లారీ